పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతరం 5 మొదలు 15 సంవత్సరాలుంటూ ఉన్నది. మహర్షి వాత్స్యాయనుడు ఆయన సూత్రాలలో (3-1-2) 'త్రిరాతృభృతి న్యూనవయసం' అని చెప్పినాడు. అంటే వధూవరుల మధ్య అంతరం తప్పకుండా మూడు సంవత్సరాలైనా ఉండి తీరాలన్నమాట. దీనిని బట్టి 3 మొదలు 15 సంవత్సరాల వరకూ అంతరం ఉండవచ్చును. 'ఆర్ట్ ఆఫ్ లవ్ ఇన్ ది ఓరియంట్' అనే గ్రంథంలో యన్.కె. బాసు మహాశయుడు భార్యాభర్తల అంతరాన్ని గురించి 'Ten years of age may be put as the safe biologic 'buffer' between marital partners in view of the fact that the senile changes take place earlier in Women than in Men and that feminine charm is always the outstanding asset in the balance sheet of Nuptials' అని వ్రాసి ఉన్నాడు. అంటే మొత్తముమీద ఏ మతాన్ని అనుసరించి చూచినా, మూడు సంవత్సరాలకన్నా తక్కువ గాని అంతరం వధూవరుల మధ్య తప్పకుండా ఉండితీరాలని అర్థమౌతున్నది.

(ఆంధప్రత్రిక 1948, నవంబర్ 17)


256

వావిలాల సోమయాజులు సాహిత్యం-4