పుష్పాలంకరణపట్టభద్రలైన పుష్పలావికలు పూర్వ పట్టణములకుఁ బెట్టని యలంకారములు. నర్మ సరసోక్తులకు వా రేడుగడలు. వారి నిశితసంభాషణలకుఁ గుసుమములు సంకేతములు. 15[1] పొన్న పూవొడి నేల పొదివితివే చెలి' యని పుష్పముల విలిచికొనవచ్చిన పల్లవశిఖామణి యొకఁడు ప్రశ్నింపఁ బుష్పలావిక కర్తుక 'పొడమె బల్దీవిపై పొదువవలదె’ యని సరసమగు సమాధాన మొసఁగి యతని హృదయమును ముప్పిరిఁగొనఁ జేయుచున్నది. మధురానగరి యందు -
చ. 16[2]"సరసులనర్మ మింపుల నొసంగఁ గదంబఁపు దండఁగట్టుచోఁ
గరగుటఁదెల్పుదృక్తరళ కాంతులు నుత్తరమిచ్చు నంతరాం
తరములనవ్వులు న్గలువతండము మొల్లలు నుంచు మిన్నుగ్రు
చ్చి రహిని రిత్తనూలొసఁగి సిగ్గువహింతురు పుష్పలావికల్.”
ప్రియులు సంకేతస్థానములఁ జెప్పికొనుటకును బుష్పములు చిహ్నములై యెప్పుచున్నవి. నీలోత్పలముపైఁ దుమ్మిపూవును నిల్పిచూపిన 'నర్ధనిశా సమయమున శివాయతనమునందు మన యిరువుర సమాగమ' మని వారి పరిభాష.
క.17[3]కలపములు గూర్ప బహువిధ
తిలకంబులు వెట్ట వింత తెరువునఁ బలు పు
వ్వులు గట్టి కట్టి ముద్దుగ
దల ముడువఁగ సరులుగ్రువ్వఁ దద్దయునేర్తున్'
సైరంధ్రులు రాజప్రాసాదములు 18[4] వావాతలకుఁ బ్రణయపాత్రలై వారి శీలసౌభాగ్యములఁ గాపాడుటయందుఁ 'గర్కటిగర్భము ధరించినట్లు' జాగరూకత వహింప నెంతయు విలసిల్లుట ప్రసవకులకీర్తి నుగ్గడించుచున్నది.
'పరమేష్ఠి రమ్యాతిరమ్యముగఁ బుష్పసృష్టి యొనర్చినాఁడు; కాని వాని కాత్మను బ్రసాదింప మఱచె' నని యొక తాత్వికుఁ డనినాఁడు. ఇతఁడు దేవత అగ్నిముఖు లైనట్లు పుష్పములు కవిముఖములని మఱచెనేమో! కవిముఖముల నే నాఁటి కా నాఁ డవి తమ భావపరంపరల వెల్లడించుచునే యున్నవి. 'ఏ కోవ పూవునే నీవు, నీ తావి పూవులకు రా' దని స్తుతిపాఠకుఁడై భ్రమరయువకుఁడు ముగ్ధకన్యకల మిథ్యాప్రణయమున మోసగింపఁ బూనుకొనిన వేళలఁ గనిపెట్టి 'నెమ్మదికి రావె
యీ తుమ్మెదకు నో పూవ! అమ్ముకోఁబోకె నీ నెమ్మనము నో పూవ!!' యని
- ↑ పొన్నపూవొడి - వసుచరిత్ర ఆ. 1, ప. 109
- ↑ సరసులనర్మ - ఆముక్తమా. ఆ. 2, ప. 20
- ↑ కలపములఁగూర్ప - తిక్కన విరాటపర్వము ఆ. 1, ప. 320
- ↑ వావాత : మహిషి, పరివృక్త, వావాత, పాలాగలి - ప్రాచీన రాజన్యులకుఁ బత్నీచతుష్టయము. వావాత రాజప్రణయమును జూఱఁగొనినది
____________________________________________________________________________________________________
మణిప్రవాళము
23