లక్షణము. అందులో ఆచార వ్యవహారంలోనూ, నాగరికత లోనూ, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక జీవిత విధానాలలోనూ విశేషమైన అంతరం ఉన్న జాతుల మధ్యా దేశాలమధ్యా ఈ అసహనభావము, వైమనస్య వైముఖ్యాలూ విశేషంగా గోచరిస్తూ ఉంటవి.
జంతు జాతుల్లోనూ ఒక జాతికి చెందిన ఒక విలక్షణత ఉన్న ప్రత్యేక జంతుకోటికి (Distinct Species) మరొక విలక్షత కలిగిన ప్రత్యేక జంతుకోటితో కామసంబంధం కనిపించదు. అది ఆయా జాతులకు సహజావబోధము (Instinct). అదేరీతిగా రూపంలో స్వజాతికంటే భిన్నమైన జాతిలోని వ్యక్తులతో కామబంధాన్ని వైవాహిక సంబంధాన్ని గానీ, కలిగి ఉండటాన్ని జాతులు అసహ్యించుకుంటవి. స్త్రీ జాతిలో ఉండే కామసంబంధమైన సహజావబోధము పురుష జాతిలోని కామసంబంధమైన సహజావబోధంకంటే భిన్నమైనది. అందువల్ల స్త్రీలకు విదేశీయులతో రక్తసంబంధమంటే పట్టుదల విశేషము.
ఇందుమూలంగా మానవజాతిలోనే అనేకరకాలైన విలక్షణవర్గాలు (Species) ఉన్నవనికాదు. కొన్ని కొన్ని ఇళ్ళల్లో అలవాటు పడ్డ జంతువుల్లో కూడా పరస్పరమూ మిథున క్రీడకు అంగీకారము కనిపించదు.
అయితే ఈ సహజావబోధానికి కారణం ఏమిటి? శాస్త్రజ్ఞులు దీనికి 'సామ్యము' (Similarity) ముఖ్య కారణంగా పలుకుతున్నారు. కామ విషయంగానూ జాతులు గానీ, వ్యక్తులు గానీ ఒక విధమైన సామ్యమును ఆదరిస్తారని వారి అభిప్రాయము. సంతాన శాస్త్రజ్ఞులు ఇది ఒక విధమైన శారీరక న్యాయము (Physiological Law) అన్నారు. సంతానోత్పత్తికి ప్రతికృతి (Reproduction) ప్రాథమికాంగము. దీనికీ సామ్యము అత్యావశ్యక మని వారి అభిప్రాయము.
ఈ సామ్యము ప్రత్యేక జాతులమధ్యనే కాదు. ఒక విలక్షణత ఉన్న వర్గంలోనైనా అత్యవసరమని శాస్త్రజ్ఞులు పలుకుతున్నారు. పరస్పర సంయోగము (Inter-Crossing) చేయించదలచుకున్నా ఈ సామ్యమును ముఖ్యంగా గమనించ వలసి ఉంటుందని వారి ఊహ.
వృక్షజాతిలో గానీ, జంతు జాతిలోగానీ ఒక విలక్షణమైన వర్ణానికి (Species) మరొక విలక్షణమైన వర్ణంతో పరస్పర సంయోగం కలిగించవచ్చును. అటువంటి సందర్భాలలో సంతానం విశేషముగా కలుగుతుందని కానీ, ఎక్కువ సంఖ్యకు అవకాశం ఉంటుందని గానీ సిద్ధాంతీకరించటానికి వీలులేదనీ, దానికి భిన్నంగా జరగటం ____________________________________________________________________________________________________
222
వావిలాల సోమయాజులు సాహిత్యం-4