కన్యకలను జయించినవారికి ఇవ్వటంగాని జరగలేదు. పైగా రోమను కన్యకలను ఇతరులకు ఇచ్చి వివాహం చేయటము చట్టసమ్మతము కాదని తీర్మానించినారు. వారి కన్యకలను బానిసలుగా స్వీకరించి వారితో కామోపభోగాన్ని అనుభవించటాన్ని వారి న్యాయస్థానం అంగీకరించింది.
ప్రతి జాతీ ఇతరజాతిని తనకంటే తక్కువదానిగా పరిగణించటం లోకంలో పరిపాటి. అందుమూలంగా ఇతర జాతులతో వైవాహిక సంబంధాలను అరికట్టటానికి యత్నిస్తుంది. జాతులు ఇతర జాతులతో వైవాహిక ప్రణయాన్ని అడ్డుకోవు. కానీ అటువంటి వివాహాన్ని న్యూనతాదృష్టితో చూడటము కద్దు. ఇది జాతులు సహజ లక్షణాలు.
అటువంటి పట్టింపులు కేవలం రక్త సంబంధికులతో తరతరాలనుంచీ సాంసారిక యాత్ర గడుపుతూ వస్తున్న తక్కువ జాతివారిలో విశేషంగా కనిపిస్తుంది. స్త్రీ పురుషులలో గమనిస్తే ఈ నిరసనభావం స్త్రీలలో విశేషంగా గోచరించింది.
సాధారణంగా లోకంలో జరిగిన జాత్యంతర వివాహాలనూ (Inter-National Marriages) వర్ణాంతర వివాహాలనూ (Inter-caste marraiges) పరిశీలిస్తే ముఖ్యంగా, ఎక్కువ సందర్భాలలో భర్త ఉన్నతమైన కుటుంబాలకు గానీ, వంశానికి గానీ చెంది ఉంటాడు. దీనికి మూలకారణం సామాజిక శాస్త్రవేత్తలు ఇలా చెపుతున్నారు:
"స్త్రీ తనను తక్కువచేసుకోటానికి నిరాకరిస్తుంది. పురుషుడికి అంతటి సునిశితత్వం గానీ, జాత్యభిమానము, వర్ణాభిమానముగానీ ఉండదు.”
ఇందుకు నిదర్శనంగా అత్యుత్తమ ప్రజాస్వామిక దేశమని ప్రఖ్యాతిగన్న అమెరికాను తీసుకుందాము. ఆ దేశంలో నీగ్రో పురుషులను వివాహమాడిన శ్వేతజాతి స్త్రీలు అల్పసంఖ్యాకులు. దక్షిణ రాష్ట్రాలలో అటువంటి వివాహాలను ఆచారమూలంగా బహిష్కరించారు. అయితే అంతమాత్రాన శ్వేతజాతి స్త్రీలకు నీగ్రోజాతి పురుషులతో కామసంబంధం లేదని చెప్పటానికి వీలులేదు. మరికొన్ని రాష్ట్రాలలో ఆచారం మాట అటుంచినా న్యాయశాస్త్రం కూడా అంగీకరించదు.
ఈ కూటాంతరతకు (Endogamy) ముఖ్యంగా జాతిగర్వమూ, దేశౌన్నత్యగర్వమూ కారణాలు. జాతిగర్వము మూలంగా అన్యజాతులమీద అసహన భావం కలగటం సహజలక్షణం. అదేరీతిగా దేశౌన్నత్యగర్వం కారణంగా విదేశీయులంటే సౌహార్దము లేకపోవటమూ, వైముఖ్యమూ, వైమనస్యమూ కలిగి ఉండటమూ సమస్త దేశాలవారికీ
సంస్కృతి
221