జాతులు వెనుక గుంపులుగా జీవిస్తూ గుంపు పెళ్ళిళ్ళు (Group Marriages)
చేసుకుంటూ ఉండేవారు. సహచరీ వివాహానికి (Punatiar Marriages) అలవాటు
పడి, ప్రత్యేక కుటుంబాలుగా ఏర్పడవలసి వచ్చింది. ఈ వివాహ విధానంలో అనేక
రకాలైన మార్పులతో వివాహం జరగటానికి అవకాశం ఉన్నది. అయితే - ప్రధానాంశం
ఒకటే. ఒక కుటుంబంలోని పురుషులందరికీ సమష్టిగా ఆ కుటుంబంలోని స్త్రీలందరూ
భార్యలై ఉంటారు - పుట్టుకతోనే. వారు మాత్రము తల్లీకుమాళ్ళూ, అన్నాచెల్లెలూ,
అక్కా తమ్ముడూ కాకూడదు.
ఈ వివాహ విధాన పరిణామ రూపంగా దంపతీవివాహము (Pairing Marriage) ఏర్పడ్డది. ఒక పురుషుడు ఒక స్త్రీతో తాత్కాలికముగానో, లేక కొంతకాలమో వైవాహిక ధర్మాన్ని కలిగి ఉంటాడు. గుంపు పెళ్ళిలో వివాహము వ్యక్తిపరము కాదు. ఈ రెండు విధానాలలోనూ అది వ్యక్తిగతము.
గుంపు పెళ్ళిళ్ళు క్రమంగా ప్రపంచంలో అంతరించిపోయినవి. దాంపత్య వివాహాలు (Pairing Marriages) ఆచారాలైనవి. ఈ విధానంలో బహుపత్నీత్వము ఉండకపోదు. ప్రతి మగవాడికీ అనేకమంది భార్యలున్నా వారిలో ఒకతె మాత్రమే ప్రధాన భార్య అయి ఉంటుంది. బహుభర్తృత్వము ఉన్న జాతుల్లో అనేక మంది భర్తలున్నా ఆ స్త్రీకి ఒకడే ప్రధాన భర్తగా వ్యవహరిస్తాడు. ఇంతేకాదు - జాతుల్లోని స్త్రీ పురుషులు ఇద్దరూ అప్పుడప్పుడూ కామతృష్ణను తీర్చుకోవటానికి ఈ దాంపత్య వివాహబంధాన్ని అతిక్రమించి అన్య స్త్రీ గమనమూ, స్త్రీ పరపురుష గమనమూ చేయటానికి అవకాశముండేది. కాని, స్త్రీ విషయంలో ఈ హక్కు ఎంతోకాలం నిలువలేదు. స్త్రీ ఒక పురుషునితో సహచరించటం ప్రారంభించింది మొదలు, ఏ జాతీ ఆమెపట్ల పరపురుష గమనాన్ని అంగీకరించలేదు. దానికి వ్యతిక్రమం జరిగితే కఠిన శిక్షకు పూనుకున్నవి కూడాను.
మాతృస్వామికాలైన కుటుంబాలలో (Matriarchical Families) బహుభర్తృత్వమూ (Polyandry), పితృస్వామికాలైన కుటుంబాలలో (Patriarchical Families) బహు భార్యాత్వమూ అన్ని కాలాలలోనూ కనిపించినా, ఈ ద్వివిధ వివాహాలూ ఆర్థికంగా అనేకమైన అవస్థలను తెచ్చిపెట్టటం చేత, ఏ నాడూ ఇవి ప్రబలంగా జాతి కంతటికీ వైవాహిక విధానాలుగా ఉన్నవని చెప్పటానికి అవకాశం లేదు.
దాంపత్య వివాహ విధానంలో వివాహ విచ్ఛేదానికి ఏ నిమిషాన పట్టినా అవకాశం ఉన్నది. అందులో కష్టమేమీ లేదు. నిబంధనలు లేవు. పూర్వంనుంచి వలెనే పిల్లలు తల్లికి చెందుతారు. ____________________________________________________________________________________________________
214
వావిలాల సోమయాజులు సాహిత్యం-4