వివాహము - ఏకపత్నీత్వము
అనాది కాలంనుంచీ సంఘానికి మూలాధారాలైన స్త్రీ పురుషుల పరస్పర శారీరక సంబంధం అనేక కారణాల మూలంగా మార్పులు పొందుతూ నేటి వివాహ వ్యవస్థగా పరిణమించింది.స్త్రీ పురుషుల శారీరక సంబంధం వల్ల సంతానము కలగటమూ, తన్మూలంగా కుటుంబాలు ఏర్పడటమూ జరిగి ఉంటుంది. అదే క్రమక్రమంగా మానవ జాతుల్లో ఆచారంగా పరిణమించి ఆయా కాలాలల్లో చట్టసమ్మతమైన వివాహంగా అంగీకృత మౌతూ వచ్చింది.
వివాహ వ్యవస్థకు ఆదిమ రూపం స్త్రీ పురుషుల శారీరక సంబంధం. దాని స్వరూప స్వభావాదులను గురించి శాస్త్రజ్ఞులు భిన్నాభిప్రాయాలను వెల్లడించారు. కొందరు ఒక జాతిలోని స్త్రీ పురుషులు యావన్మందీ తల్లి, చెల్లెలు, అన్న, తమ్ముడు అనే వివక్ష లేకుండా కామోపభోగం నెరపుకున్నారని అభిప్రాయపడినారు. కొందరు అటువంటి వివక్షారహిత కామోపభోగం (Sexual Promiscuity) ఉన్నదని నిరూపించటానికి తగిన ఆధారాలు లేవనీ, అటువంటి స్థితి మానవునికి పూర్వరూపమైన వానర జాతిలోనే కనిపించదనీ పలుకుతున్నారు.
ఒక మాట మటుకు సత్యము. ఆదిమ మానవ జాతుల్లో నేటి సంఘంలో కనిపిస్తూ ఉన్న నీతినియమాలూ, విధినిషేధాలూ లేవు. ఒకానొక స్థితిలో మానవజాతిలో స్వీయ బంధు ప్రణయము (Incest) ఉన్నదని అంగీకరించటానికి తగిన ఆధారాలు కనిపిస్తున్నవి. ఈ పద్ధతి ననుసరించి అన్నాచెల్లెళ్ళూ, అక్కాతమ్ముళ్ళూ, తల్లీకుమాళ్ళూ భార్యాభర్తలు కావచ్చును.
అనాది మానవ కుటుంబాలు (Families) ఇటువంటి వివక్షారహితమైన కామోపభోగస్థితి నుంచే ఉద్భవించినవని మోర్గన్ పండితుని అభిప్రాయము. నేడు ఇటువంటి శారీరక సంబంధాన్ని గానీ, వైవాహిక ధర్మాన్ని గానీ నిరూపించే జాతి ప్రపంచంలో ఎక్కడా కనిపించటం లేదు.
తరువాతి కాలంలో వివాహ వ్యవస్థలో ఒక మార్పు వచ్చింది. ఏక గర్భ జనితులైన సంతానం వివాహమాడరాదనే నియమం ఏర్పడ్డది. తల్లీబిడ్డల మధ్య కామభోగం నిషిద్ధమైనది. ఇది వైవాహిక విధానంలో రెండో మెట్టు. అందుమూలంగా మానవ ____________________________________________________________________________________________________
సంస్కృతి
213