Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తరువాత ఆ బిడ్డలను కుమారుని సంతానంగానే వ్యవహరిస్తారు. అతిథి పూజనము కోసం అనేకమంది భార్యలను చేసుకోవటము జాతిలో కనిపిస్తుంది.

అనాది మానవ సంఘంలో స్త్రీ పురుషులకు సమానత్వ ముండేది. కాని మానవ ఆటవిక జీవితంలో సంసారానికి తగినంత ప్రాధాన్యం లేకపోవటం వల్ల స్త్రీలకు స్వాతంత్ర్యం గానీ, స్వామిత్వం గానీ అబ్బలేదు.

కాలక్రమేణా కొన్ని జాతుల్లో సాంఘిక ప్రాధాన్యం సంక్రమించి నప్పుడు ఆర్థిక ప్రాభవం గల స్త్రీలను ఆర్థిక ప్రాపకం కోసమూ, సంఘ ప్రాధాన్యతం కోసమూ అనేకమంది పురుషులు వివాహమాడే ఆచారం వచ్చింది. దానినే శాస్త్రం బహు భర్తృత్వం(Polyandry) అన్నది. ఈ నాటికీ ప్రపంచంలో అక్కడక్కడ అనాదిగా కొన్ని అనాగరక జాతుల్లో బహుభర్తృత్వ వివాహ విధానము అమలులో ఉన్నది.

పురుషుడికి ప్రాధాన్యం లభించే స్వామిత్వం కాలక్రమేణా స్త్రీలందరూ అతని బానిసలు కావడం ఆరంభించారు. ఆర్థిక సంపదను చూచో, సంపన్నతను చూచో,సాంఘిక ఔన్నత్యాన్ని చూచో ఒక పురుషునికే అనేకమంది భార్యలుకావటము గౌరవప్రదమని భావించేవారు. దానిని ఒకానొక వివాహ సంస్థగా పరిణమించిన తర్వాత శాస్త్రకర్తలు దానినే బహుభార్యాత్వ వివాహమన్నారు.

ప్రపంచ తాత్త్విక భావసంఘంలోని మహారచయిత బెర్నార్డ్ షా ఈ వివాహ విధానాలను గురించి ఇలా అభిప్రాయపడ్డాడు.

'బహుపత్నీత్వం మీదగాని బహుభార్యాత్వం మీద గానీ అసహ్యం కలిగేలా లోకంలో ఏకగామిత్వము (Monogamy) ఆచరణలోకి వచ్చిందని అనుకోవటం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం - స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య దరిదాపు సరిసమానం కావటంతో, ఎక్కువమంది భర్తలున్న స్త్రీకంటే తక్కువమంది భర్తలున్న స్త్రీకే విశేష సంతానం కలుగుతుంది.

‘ప్రతి మగనాడూ ఇద్దరు భార్యల కంటే ఎక్కువ భార్యలుంటే కామశక్తిని గురించిన కొలమానాన్ని దూరంగా ఉంచినా, అతని రాబడి, మూడురెట్లు పెరగవలసి ఉంటుంది.ఆర్థికంగా ఆలోచిస్తే లోకంలో ప్రతి ముగ్గురికైనా ఇద్దరు భార్యలు ఉండే అవకాశం లేదు.

'స్త్రీలు బహు భర్తృత్వాన్ని ఎందుకు వద్దనుకుంటారు, ఇందుకు కారణం? ప్రతి స్త్రీకీ భర్త దొరికే అవకాశం లేకుండా భర్తలుగా పురుషులనందరినీ కొందరు<references/ ———————————————————————————————————————-


211

సంస్కృతి