Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారీరక (Physical) ఉద్వేగ (Emotional)) వైజ్ఞానిక (Intellectual) ప్రతిపత్తులలో సామ్యం లేకపోవటము 3. స్త్రీలలో సహజలక్షణాలైన ఋతుధర్మము, గర్భధారణమూ కారణముగా పురుషుడు అనేకమందిని వివాహమాడటమూ. తన తృప్తికోసము అనేకమంది వ్యక్తులతో ఏకకాలంలోనే కాపురం చేయవలెననే కోరిక వల్ల పురుషునిలో కలిగే దక్షిణ నాయక లక్షణమూ, నవతాప్రియత్వమూ. 4. సంతానమూ, ఆస్తిపాస్తులు.

ప్రాచ్యదేశాలలో ‘ఆస్తి’ ముఖ్యంగా బహు భార్యాత్వానికి దారి తీస్తుంది. ఆత్మబీజ జనితునికే ఆస్తిని సంక్రమింపచేయవలెననే ఆకాంక్ష ప్రాచ్యజాతుల్లో విశేషము. జపాను దేశంలో ఉంపుడు కత్తెవల్లనైనా కులధర్మాన్ని నిలపటానికి సంతానాన్ని పొందవచ్చును. సంతానం కోసం ఎందరినైనా వివాహం చేసుకోవటం ప్రపంచంలో అనేక జాతుల్లో ఆచారంగా నేటికీ కనిపిస్తూ వున్నది.

బహుభార్యాత్వ వివాహానికి భౌతికమైన లాభం కూడా మరొక కారణం. అనేకమంది భార్యలను వివాహం చేసుకోవటం వల్ల పూర్వకాలంలో రాజుల ప్రాపకం అభివృద్ధి పొందింది. అంతేకాదు, ఒక గౌరవనీయమైన రాజవంశంలో జన్మించినవానికి తాను నాల్గవ భార్య ఐనా గౌరవ ప్రదంగానే భావించేది స్త్రీ. అతని ఆస్తిపాస్తులను అనుభవించటానికి అవకాశం కలుగుతుందనే దృష్టి కూడా ఇందులో ఇమిడి లేకపోలేదు.

లోకంలో ప్రకృతి సహజమైన వైవాహిక ధర్మము (Natural Instindct)బహుగామిత్వము (Polygamy). అనేకమంది భార్యలను వివాహం చేసుకోవటం వల్ల సగటున సంతానం పెరుగుతుందనీ, దానిమూలంగా భౌతిక లాభం చేకూరుతుందనీ అనుకోవటం కూడా పొరబాటు. బహుపత్నీత్వం విశేషంగా ఉన్నా, బహుభార్యాత్వము విశేషంగా ఉన్నా సంతానం అభివృద్ధి పొందదు.

పెద్ద పెద్ద సంసారాలుండటం గొప్పగా భావించే కొన్ని అనాగరిక జాతుల్లో నేటికీ బహుపత్నీత్వం విరివిగా అమలులో కనిపిస్తుంది. వారి విషయంలో ఆర్థికమైనఅభ్యంతరాలు లేవు. ఆర్థికంగా నిలవలేని స్థితిగల జూలూ దేశస్థుడయినా తప్పకుండా ముగ్గురినైనా వివాహ మాడతాడు. పూర్వ మధ్య ఆఫ్రికా జాతుల్లో మగవానిని భార్యలే కూర్చోబెట్టి పోషిస్తారు. అతనికి కూలీ ఖర్చు లేకుండా అన్ని పనులూ వాళ్ళే చేస్తారు.

పూర్వం రష్యా దేశంలో మరొక ఆచారం ఉండేదట. రష్యా దేశస్థుడు వ్యక్తుడుగాని కుమారుని కోసం ఒక కన్యకను తానే వివాహ మాడి అతడు పెద్దవాడైన తరువాత అతనికి ఒప్పచెప్పేవాడట. అంటే - ఆ రైతుకు ఆమె ఖర్చులేకుండా 'కూలి మనిషి’అన్నమాట. ఆమెవల్ల అతడు సంతానం కనవచ్చును. కుమారుడు పెద్దవాడయిన ——————————————————————————————————-

210

వావిలాలసోమయాజులుసాహిత్యం-4