పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త్రీలే ఉంచుకునే అవకాశం ఉండటం వల్ల. పురుషులు బహుభార్యాత్వాన్ని నిరసిస్తారు.ఇందుకు కారణం ప్రతి పురుషుడికీ భార్య లభించే అవకాశం లేకుండా ఉంటుంది.కాబట్టి. అందువల్ల సర్వసామాన్యులైన స్త్రీ పురుషులిద్దరూ ఏకగామిత్వాన్నే(Monogamy) కోరుకుంటారు. అందువల్ల బహుభార్యాత్వాన్ని నెత్తికెత్తబోతే సామాన్యమైన పురుషులు వ్యతిరేకిస్తారు. అదేవిధంగా బహుభర్తృత్వాన్నీ సామాన్య స్త్రీలు వ్యతిరేకిస్తారు.

ఉత్తమ శ్రేణికి చెందిన స్త్రీలు గానీ పురుషులు గానీ లేకపోవటం వల్లనే బహుభార్యాత్వం, బహుభర్తృత్వమూ లోకంలో ఆచరణలో నిలవక తప్పటం లేదు.లోకంలో ఏ పురుషుడూ కూడా తన శక్తిని మించినంతమంది భార్యలను పోషించలేడు. కాబట్టి చట్టసమ్మతంగా బహు భార్యాత్వాన్ని రద్దు చేయవలసిన అవసరం అగత్యమైంది. ఆ విధానం కొలదిగా ఏ మూలనో ఉన్నా విశేష ప్రమాదం లేదు.

(ఆంధ్రపత్రిక 1948, ఏప్రిల్28)

———————————————————————————————————

212

వావిలాల సోమయాజులు సాహిత్యం-4