పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


91. ప్రపంచ వివాహ చరిత్ర కారుడు వెస్టర్ మార్కు 1. జనసంఖ్య 2. స్త్రీ పురుష గృహజీవన విధానమున శారీరక (Physical) ఉద్వేగ (Emotional) వైజ్ఞానిక (Intellectual) ప్రతిపత్తులలో సామ్యత లేకపోవుట 3. స్త్రీ ఋతుధర్మము, గర్భధారణము, దీర్ఘవ్యాధి కారణముగ మానవునిలో (దక్షిణత్వము) బాహునాయికత్వాపేక్ష (Polygomons Nature) నవ్యతా ప్రియత్వము 4. సంతానము ఆస్తిపాస్తులు బహుభార్యాత్వమునకు కారణములని చెప్పినాడు. చూడు. ఆంధ్రవారపత్రిక - 'నా బహుభార్యాత్వము - బహుభర్తృత్వము (27-4-48)

92.శీలమును గూర్చి ప్రపంచములోని అనేక దేశముల భిన్నభిన్నములైన అభిప్రాయములున్నవి. ఏతద్రక్షణార్థము వివిధ జాతులు వివిధ మార్గముల ననుసరించినారు - W. J. Fielding Strange customs of courtship & Marriage pp. 134–155; MEHTA : Scientific Curiosities of Love, Life and Marriage pp. 263-256. The battle of venus - HAAG: అనాగరిక జాతులలో కనుపించు కన్యాత్వమను దోషపరిహరణము (Defloration sceintific curiosities of Love Life and Marriage pagel41.142) నే యుగమున లేదని విస్పష్టము.

93.అలంకార శాస్త్రవేత్తలు దశావస్థలను చర్చించి 'మరణము' కాదు మరణయత్నము పదియవ అవస్థ అని చెప్పినారు. ప్రతాపరుద్రీయమున ప్రలాపము, సంజ్వరము అను మరి రెండు అవస్థలను అధికముగ చెప్పినాడు. భావప్రకాశమున శారదా తనయుడు ఈ దశావస్థలకు భిన్నముగ 'దశధా మన్మథావస్థా భవే ద్వాదశ ధా౽పివా, ఇచ్ఛోత్కంఠాభిలాషశ్చ చింతా స్మృతి గుణస్తుతీ, ఉద్వేగోధః ప్రలాపస్యా దున్మాదో వ్యాధిరేవ చ, జాడ్యం మరణ మిత్యాద్యేద్పేకై శ్చి ద్వర్జ్యతేబుధైః' అని పలికినాడు. (కావ్యాలంకార సంగ్రహము. సంపాదకుడు: సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి పుట 369)

94. FAUSBOLL - Jatakas vol. V 448; Kuntala Jalaka p. 536

95. ప్రాచీన భారతీయుల ప్రణయలేఖలు చిత్రలిపిలోను, సంజ్ఞలలోను వ్రాసుకొనెడివారు పత్రపుష్పాదికములను అందుల కుపయోగించు కొనుట కావ్య నాటకాదులవలన తెలియుచున్నది. చక్షుర్గోచరము గాని రీతిగ గుమ్మపాలతో గాని, పటిక నీటితో గాని వ్రాయుట రోమనులవలె (Ars Amatoria B.III 625 - 29) భారతీయు లెరిగినట్లు లేదు.

96. కామసూత్రములను పరిశీలించినపుడు హస్తినీజాతి స్త్రీలు అపద్రవ్య ప్రియలని తెలియుచున్నది. నష్టరాగ ప్రత్యానయనాద్యధ్యాయమున అపద్రవ్యములను వృష్యయోగములుగ మహర్షి పలికి యున్నాడు. మంద ధృస్తములగు నష్టములను ____________________________________________________________________________________________________

సంస్కృతి

177