Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నష్టరాగలకు సంబాధకము నుపమర్దన మొనర్చి 'అపద్రవ్యాణి యోజయేత్' (7.3.3) అని చెప్పినాడు. 'తాని సువర్ణరజత తామ్ర కాలాయన గజదంతగవల (కొమ్ము) ద్రవ్యమయాని' (7.2.5) అని, పలికి త్రా పుషాణి పైసకాని చ మృదూని శీత వీర్యాని వృష్యాని కర్మణి చ దృష్టూని భవంతీతి బాభ్రవీయాః యోగాః' (7.2.9) అని బాభ్రవీయుల సీసక త్రాపుసక అపద్రవ్యములను చెప్పి 'దారుమధాణి సామ్యతశ్చేతి వాత్స్యాయనః' అని దారుమయ అపద్రవ్యములను సామ్యమును బట్టి యోజన చేయదగుమ అని నిజాభిప్రాయమును వెల్లడించినాడు. ఇందలి కర్కశ పర్యంత, బహుళ, సంఘటి, చూడక, ఏకచూడక, కంచుక, జాలకాది భేదములను చెప్పినాడు. వాటి ప్రయోగ విధానమును నిరూపించినాడు. (7.2.14) అనేక అనాగరిక జాతులలో నష్టరాగలయిన వృద్ధ స్త్రీలలో రాగస్థాపనార్థము అపద్రవ్యముల నుపయోగించుట నేటికిని అలవాటు. ఇట్టివానిలో పురుష మోహనమును పోలిన కృత్రిమ లింగము (Artificial Phallus - Dildo) ఒకటి. ఇది స్వజాతి ప్రణయలగు (Tribades) స్త్రీలు పాశ్చాత్యదేశములందు విరివిగ నుపయోగింతురు. వారు దీనికి Consola Leur, Bijou Indiscret, Gaude Mihi, Penis Succdea Neus ఇత్యాది నామములతో వ్యవహరింతురు. ఈ అపద్రవ్యములు అన్ని దేశములందును అతి ప్రాచీన కాలమునందుండి ఉన్నవి. యూరప్ దేశమున ఇవి మధ్యకాలములోనే విశేష ప్రాచుర్యము వహించినట్లు బ్రాంటోమ్ మహాశయుని 'Lives of Fair and Gallent Women’ అను గ్రంథమువలన తెలియుచున్నది. ప్రాచీన గ్రీసు దేశమున వీని యుపయోగమున్నట్లు ఎరిస్టోఫానిస్ 'Lysistrata' వలన తెలియవచ్చు చున్నది. బాబిలోనియా శిల్పములందు స్త్రీలు ఇట్టివానిని హస్తమునం దుంచుకొన్నట్లు ప్రతిమలు బహుళముగ కనిపించును. వీనికి ప్రాచీన గ్రీకులు Olibos అని నామకరణ మొనర్చిరి. స్త్రీల జాత్యాజీవితము (Sexual Life of Women) అను గ్రంథమున కిస్చ్ మహాశయుడు ఇట్టివానిలో అతిదీర్ఘములైన వానిని (వాత్స్యాయన మహర్షి సంఘాటీ వంటిది) వాన్ మస్చకా చూచినట్లు చెప్పుచున్నాడు. ఇట్టి కృత్రిమలింగములలో కపి పాలుపోసి యోని రంధ్రముద్వారా లోపలికంపి శుక్రస్యందనము కలుగునట్లొనర్తురని అతని అభిప్రాయము. ఇట్టిదే 'కృత్రిమయోనిని' (Mannikin) ని పురుషు లుపయోగింతురు. ఈ సూత్రముల ననుసరించి స్వీయలింగ ప్రణయము, (Autoeroticism) అపద్రవ్య (Olibos) ప్రణయము ప్రాచీన భారతీయులు ఎరిగినట్లు తెలియుచున్నది. ఇది అభావమున స్వజాతి ప్రణయము గాని పాశ్చాత్యలోకములోని స్వతఃసిద్ధ స్వజాతీ ప్రణయము (Homo-Sexuality) కాదు. ____________________________________________________________________________________________________

178

వావిలాల సోమయాజులు సాహిత్యం-4