Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తిరువాన్కూరు, మధుర, తిన్నవెళ్ళి ప్రాంతము. కాంభోజము దక్షిణ - పశ్చిమ కాశ్మీరములోని రాజూయార్ ప్రాంతము. పౌండ్రులు ఉద్ర, ఉత్కళ, మేఖల, కళింగులను వరుసగ జెప్పుటకు ఈ గ్రంథములందున్నది. బంగాళమునుండి పశ్చిమమునకు నటుపిమ్మట దక్షిణ పశ్చిమ క్రమమునకు నడచి చెప్పినట్లున్నది. గాధి రాజ్యము కన్యాకుబ్జము. (Kanauj)

55. ఈ రాగవృద్ధి కరణమును గూర్చి వాత్స్యాయనుడు ప్రశంస తెచ్చినాడు గాని కొక్కోక పద్మశ్రీలవలె వికల్ప స్వరూపమును నిరూపించలేదు. ఈ కరికరక్రీడ రతిరహస్య కర్త మతమున 5 విధములు, (VI- 241-246) పద్మశ్రీ ఇందు షడ్విధ విభేదములను పలికినాడు.

56. ఆంధ్ర కామశాస్త్ర వ్యాఖ్యాత కావ్యస్మృతి తీర్థ శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రులవారు వాత్స్యాయన మహర్షి పేర్కొనని అనేక దేశస్త్రీల సాత్మ్యములను జ్యోతీశ్వరాచార్యుని పంచసాయకాది గ్రంథములనుండి గ్రహించి విపులముగ సంకలనమొనర్చినారు. (ఆంధ్ర కామసూత్రములు ప్రథమ ముద్రణము పే. 370-371)

57. BASU - Love in the Orient- Chapter X & XI

58. సాహిత్య దర్పణ కారుడు సమస్త రత కోవిదయైన ప్రౌఢ నాయికను "క్వచిత్తాంబూలక్తః క్వచిదగరు పంకాంక మలినః, క్వచిచ్చూర్ణో ద్గారీ, క్వచి దపిచ సాలక పదః, వలీభంగా భోగై రలక పతితైః శీర్ణ కుసుమైః స్త్రియా సర్వావస్థాం కథయతి రతం ప్రచ్ఛదపటః” అని వర్ణించినపట్ల మార్జార, ధేనుబంధ, సమపద, ఉత్తానాది సురత విశేషములను పురుషాయితమును గర్భితముగ పలికిన వాక్యములు ఇందుకొక ఉదాహరణము.

59. “The reader will bear in mind that the exceeding pliablity of the Hindu's limbs enables him to assume attitudes absolutely impossible to the Europeans, and his chief object in Congress is to avoid tension of the muscles, which would otherwise shorten of the period of enjoyment Dr. Norman Himes vol VIp. 557

60. IBID 298

61. PAUL LECROIX, History of Prostitution - vol I p. 242 (Putnams Translation)

62. నెల్లూరు శివరామకవి - కామకళానిధి (శృంగార గ్రంథమండలి - సంపాదకులు, పురాణం సూర్యనారాయణ శాస్త్రులవారు) ____________________________________________________________________________________________________

సంస్కృతి

169