పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


63. ఉత్తానకరణములు అతిప్రాచీనములు. ఇవి మిగిలినవారికంటె ప్రశస్తములైనవని శాస్త్రజ్ఞుల అభిప్రాయము. ఇందు యోనిమార్గము ఉన్నిద్ర లింగమున కనుగుణమై యుండుటయే ప్రశస్తిగల కారణము. వీటియందు స్త్రీ పురుషులన్యోన్యము అవయవ నిరూపణమును, భావవ్యక్తీకరణము నొనర్చుటకు వీలగుచున్నది. ఇందు (సంపుటక (Enclosing) పీడితక (Oppressive) వేష్టితక (Clasping) వేణువిదారిత (Split Bamboo) బంధములు (Poses or Attitudes) కుబ్జలింగత్వ ముననే (Phallic insufticienge) ఉపకరించును. ప్రపంచములోని సమస్త జాతులలోను ఈ కరణములే ప్రాముఖ్యము వహించినవి. ఈజిప్టు దేశ పురాతన గోరీలందును, పెరూలోని ఇంకా జాతులవారి చంద్రదేవాలయము లందును ఉత్తానకరణ శిల్పములు కనుపించుచున్నవి. ఆఫ్రికా అనాగరిక జాతులలోను, అమెరికా జాతులలోను ఈ కరణములనే విరివిగ వాడుదురు. దీనికి విపరీత కరణమే పురుషాయితము. సర్వకాలములందును రోమక జాతులవారిలోను నిట్టి ఆచారమున్నట్లు ఆర్స్ అమటోరియా వలన తెలియుచున్నది. పురుషుని అధఃస్థితికి మహమ్మదీయ జాతులంగీకరింపవు. “పురుషుని భూమిని - స్త్రీని ఆకాశమున జేయువానికి నరకము కల్గుగాక” అని వారికొక సామెత యున్నదట! సాహోలీ జాతిలో పురుషాయిత బంధ ప్రియత్వము విశేషము. అందు నాయికలు Digtisha అనునొక మంథన క్రియ యొనర్తురట. దానిని వృద్ధ స్త్రీలు యువతులకు ఒక మండల దినములు నేర్పుదురట. అది ఎరుగని స్త్రీకి ఆయా జాతులలో గౌరవ ప్రతిపత్తులు తక్కువ. కమటా షౌడిల్సు అనువారు ఈ బంధమును పాపకృత్యముగ తలచి వారి ముఖ్యాహారమగు చేపలవలె తిర్యక్కరణమున సంప్రయోగమొనర్తురట!

64. తిర్యక్కరణముల వలన కొంత శారీరకోపయోగము స్త్రీ పురుషుల కిరువురకున్నది. పురుషభారము వహింప వలసిన అగత్యముండదు. పురుషునకు విసృష్టి అతివేగముగ జరుగదు. ఇరువురుగాని లేక ఒకరు గాని కుండబొజ్జగల వారైన, లేదా గర్భధారణసమయమున నైనను నీ తిర్యక్కరణములు (Lateral attitudes) ఉపకరించుచున్నవి. వీనిని గూర్చి ఒక విజ్ఞుడు వ్రాసిన వాక్యము లెంతయు సమంజసములైనవి: "The Lateral attitude becomes distinctly disadvantageous unless and until the woman draws up her leg on which she is lying. In other words, this attitude virtually become half-super posed.” ఈ తిర్యక్కరణమును ఓవిడ్ మహాశయుడు ఆర్స్ అమటోరియాలో నిట్లు పొగడి ఉన్నాడు. "Of loves thousand ways a simple way and with the least labour this is, to lie on the RIGHT SIDE, and half-supine withal.” కాని ఈ తిర్యక్కరణమున భారతీయులు నాయికకు ____________________________________________________________________________________________________

170

వావిలాల సోమయాజులు సాహిత్యం-4