Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాశిష్ఠ, బౌద్ధాయనులు దీని విస్తీర్ణము కొంత తగ్గించి చూపినారు. (Studies in Vatsyayana's Kama Sutras) వాత్స్యాయనుని మాళవకము నేటి తూర్పు మాళవము, దాని ముఖ్యపట్టణము విదిశ (Bhilsa). ఆభీర దేశ విషయమున కామసూత్ర వ్యాఖ్యాత 'అభీర దేశః శ్రీకంఠ కురుక్షేత్రాది భూమిః (2.5.24) సూత్ర వ్యాఖ్యానము) అని దేశ నిరూపణమున పొరబడినాడు. ఆయన చెప్పినట్లు ఆభీరము కురుక్షేత్ర శ్రీకంఠములతో సంబంధము కలది కాదు. బృహత్సంహిత ఈ దేశమును కొంకణ, ఆకర, అవంతి, వనవాసి మొదలగు దేశములతో కలిపి పలికినది. అందువలన ఆభీరము పశ్చిమ భారతము లోనిది కావలయును. అది నాసిక ప్రాంతము. వాత్స్యాయనుని లాటము తూర్పు గుజరాతు బరోడాలగు సౌరాష్ట్ర అవంతులకు మధ్యదేశము. నేటి ఉత్తర కథియవాడ దేశము. కోసలము ఔంఢ్ రాష్ట్రము. పాటలీపుత్రము మగధదేశ రాజధాని ప్రాంతము. మహారాష్ట్ర దేశమును కామసూత్ర వ్యాఖ్యాత 'నర్మదా కర్ణాట విషయోర్మధ్యే మహారాష్ట్ర విషయః' (2.5.28) అని నిర్దేశించినాడు. వంగము దక్షిణ బంగాళదేశము. గౌడము ఉత్తర బంగాళము. స్త్రీ రాజ్యమును కోసలతో కలిపి పేర్కొనినాడు. ఈ రాజ్యమును కొందరు బాలో ప్రాంత దేశమనినారు. కొందరి మతమున నిది భూటాను, ఇతరులు ఈ రాష్ట్రమును తిబ్బత్తు దేశమనినారు. కాని ఇది పశ్చిమ తిబ్బత్తు రాజ్యము. ఇందు నేటికిని బహుభర్తృత్వము (Polyandry) వివాహధర్మముగ నున్నది. 'వంగ రక్త దేశాత్ పశ్చిమేన స్త్రీ రాజ్యం' అని వ్యాఖ్యాత (2.5.27). ఉత్కళము నేటి ఒరిస్సా రాష్ట్రము. బ్రహ్మపుత్రకు తూర్పుననున్న దేశము కామరూపము (Assam). కొంకణ రాష్ట్రమునకు తూర్పునను మహారాష్ట్రమునకు దక్షిణమున నున్నదియును వనవాసము. దీని ముఖ్యపట్టణము వనవాసి, 'Vanavasa the South Eastern portion of the Bombay Presidency, North - Western Portion of the Madras Presidency and South Western portion of Hyderabad' 'కర్ణాటక విషయా దక్షిణేవ ద్రావిడ విషయ' వాత్స్యాయనుని తదనంతరము జనించిన గ్రంథములందు మరికొన్ని దేశనామము లున్నవి. అందు తిరుభుక్తి విదేహము. నేటి తిరుహట్. అది తూర్పున కౌశికీ నదీ పరివేష్టితము దక్షిణమున గంగ. పశ్చిమమున సదానీక Gandak అని Muir; Rapti - Pargitar, Little Gandak Fleet J.R.A.S. 1907. p. 644) ఉత్తరమున హిమాలయములు. పాట్నాకు ప్రాచీన నామములు పుష్పపురము, పాటలీపుత్రమే పుష్పపురమందమన్న వీలులేదు. కావున అనంగరంగ కర్త పేర్కొనిన పుష్పపురము పశ్చిమ బీహారు కావచ్చునని కొందరి అభిప్రాయము. అంగము తూర్పు బీహారము - భాగల్పూర్, రాజ్మహల్, పూర్నియా జిల్లాలు మద్రదేశము శల్యుని దేశము (Sialkot). సౌవరము దక్షిణ పశ్చిమ రాజపుత్రస్థానము, మలయదేశము ____________________________________________________________________________________________________

168

వావిలాల సోమయాజులు సాహిత్యం-4