పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇట మహర్షి చిత్రరతములలో కొన్ని బృందసంప్రయోగ విధానములను (Group Congress) చెప్పినాడు. పురుషుడు అనేక నాయికలతో కలసి రమించుట వారి క్రీడితకము, ఐణేయము, ఛాగలము, మొదలగు భేదములతో నొప్పుననియును 'గ్రామనారీవిషయే స్త్రీ రాజ్యే చ బాహ్లికే బహవో యువానో అంతఃపురస ధర్మాణః ఏకైకస్యాః పూరిగ్రహభూతాః తేషా మేకైకో, యుగపచ్చ యథాసాత్మ్యం యథా ప్రయోగం చ రంజయే యః' (2.3.43) అను సూత్రమున అనేక యువకులు యుగపదముగ ఒక్కొక్కరు గాని, ఒక్కొక్క మాటుగాని, ఒకేమాటుగ వేర్వేరు ప్రదేశములని గాని సంప్రయోగము నెరపుటకు చెప్పినాడు. ఇట్లు చెప్పుట వలన నిది గోష్ఠీ పరిగ్రహయగు వేశ్యకు రాజపరిగ్రహకు సంబంధించినది. చిత్ర రతాంతమున మహర్షి తత్సా త్మ్యాద్దేశ సాత్మ్యాచ్చ తై సైఔర్భాతైః ప్రయోజితైః స్త్రీణాం రాగశ్చ స్నేహశ్చ బహుమానశ్చ జాయతే' (2.6.49) అని స్త్రీ స్నేహరాగ గౌరవములను పొందుటకు చిత్రరతముల చెప్పినట్లు సూచించినాడు.” అటుపిమ్మటవచ్చు సీత్కృతాద్యధ్యాయమున మహర్షి పలికిన 'కలహరూపం సురత మాచక్షతే వివాదాత్మకత్వా ద్వామ శీలత్వాశ్చ కామస్య' వివాదాత్మకము వామశీలము కలది అగుట వలన కామము కలహము వంటిదని ఆయన అభిప్రాయము. పాశ్చాత్యులును దీనిని కలహరీతిగనె (Love duel) పరిగణించినారు. కలహమగుట వలననే గ్రహణము కలిగినది. దానివలన సీత్కృతము పుట్టినది. ఇట్టి ప్రహరణములందు క్రౌర్యము లేదా అను ప్రశ్నకు మానవ జాత్యస్వభావము నెరిగిన పాశ్చాత్య విజ్ఞాని ఎల్లిస్ మహాశయుడు ఇట్లు పలికినాడు.

“When the normal man inflicts or feels to inflict, some degree of physical pain on the woman he loves, he can scarcely be said to be moved by cruelty. He feels, more or less obscurely, that the pain he inflicts, or desire to inflict, is really a part of his love, and that, more over, is not really resented by the women on whom it is exercised,

'తస్మాత్ప్రహరణ స్థాన మంగం స్కంధౌ శిరస్తనాంతరం పృష్ఠం జఘనం పార్శ్వ ఇతిస్థానాని తచ్చతుర్విధం అపహస్తకం, ప్రసృతిక ముష్టిః సమతలకమితి' (2.7.2) అను సూత్రమున ప్రహరణ స్థానములను, తద్విభేదములను నిరూపించినాడు. సీత్కృతమున ధ్వని రూపమున నున్నవి హింకారము, స్తనితము, కూజితము, రుదితము, సూత్కృతము, సీత్కృతము, ధూత్కృతము, ఫూత్కృతము అని ఎనిమిది విధములు. సంబాధక మోక్షణార్థ అలమర్థక పీడా బోధకములును అర్థసంబంధము వలన సీత్కృతము లేనట. ఇందు విరుతములు (Inarticulte Erotic Movement)


152

వావిలాల సోమయాజులు సాహిత్యం-4