విననగు చుంబనములని పద్మశ్రీ అభిప్రాయపడి చుంబనములుగ పరిగణించినాడు. ప్రధానపాత్ర మొనర్చు చుంబన నఖక్షత దంతక్షతా తాడనాదికముల వలన కలుగుటచే నీ ధ్వనులను చుంబనముల క్రింద పరిగణించుట పొసగదు. ప్రహరణములలోని కర్తరీకీలములు గమనింపదగినవి. ప్రహరణవిధులలో లెక్కగాని శాస్త్రముగాని లేదని వాత్స్యాయనుడు పలికినాడు.
తదుపరి అధ్యాయము పురుషోప సృప్తాద్యధ్యాయము. ఇందు పురుషోప
సృప్తకములు దశవిధములని చెప్పి మహర్షి "ఉపసృప్తకం మంథనం హులోవ మర్దనం
పీడితకం నిర్ఘాతో వృషాఘాత శ్చటకవిలసితం సంపుట ఇతి పురుషోపనృప్తాని”
(2.5.33) ఇట్లు సూత్రనిబద్ధమొనర్చినాడు. ఈ యంత్రయోజన విధానమును (Penile
Intromissions and Movements) కల్యాణమల్ల కొక్కోకులు వారి గ్రంథములందు
పేర్కొనలేదు. ఇవి నిరుపయోగములని కొక్కోకుడు చెప్పలేదు. ఒకానొక తమిళ కొక్కోక
గ్రంథ వ్యాఖ్యాత వీనిని కూడ చేర్చినాడు. ఇవి అధికమైన ఉపయోగమును
గూర్పగలవనుట నిస్సందేహము. చటక విలసితమునకు కొన్ని గ్రంథముల
‘చాతకవిలసితము' (The Sport of the Sparrow) అను నామమున్నది. ఈ యంత్ర
యోజనములన్నియును ఉత్తానకరణముల పురుషకృత్యములు, విపరీత బంధముల
(పురుషాయితమున) స్త్రీవిగ పైన చెప్పిన వాని కంటే నధికముగ సందంశ (Pincers),
భ్రమరక, ప్రేంఖోలితములు మూడున్నవని చెప్పినారు. (2, 8, 23) ఇందలి
సందంశమును వాత్స్యాయనుడు 'బాడబేన లింగ మవగృహ్య నిష్కర్షం త్యాం
పీడయంత్యాం వాచిరాన స్థానం సందంశః' అని నిరూపించినాడు" రతిలయమును
(Speed of the Sex Union) గురించి వాత్స్యాయనుడు ప్రసంగింపలేదు. కొక్కోకుడు
అందు ద్రుత, మధ్య, వజ్రములని త్రివిధ విభాగము లున్నట్లు పలికినాడు.
ఈ అధికరణమున తదుపరి వచ్చునది ఔపరిష్ట (Fellatio and Cunnilinctus) అధ్యాయము. ఇందు మొదట తృతీయాప్రకృతి (Hermophrodite) సంబంధమైన అనురాగము అభిమానికముగా దానిని గూర్చి చెప్పి తదుపరి నిమిత, పార్శ్వతోదష్ట, బహిస్సందంశ, చుంబితక, ప్రమృష్టక, అమ్ర చూతములను ఔపరిష్ట (Fellatio) విభేదములను తత్స్వరూపములు పలికినాడు. (2.9.1.20) ఇందును స్తన ప్రేరణముల ప్రయోగముండ వలయునని చెప్పి ఇట్టి ఔపరిష్టకములను కేవలము కులటలు, స్వైరిణులు, సంవాహికలు ప్రయోగించుకొందురని చెప్పినాడు. మరునాడు అచ్చోట చుంబనార్థము వదన సంపర్కమొనర్చుట వలన బాధ కలుగుటచే ఇది పనికిరాదని
సంస్కృతి
153