పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంఠాలింగన మొనర్చును. కాని దీనికిని స్మరదీపికయందు కనుపించు డోలా (డోలాయిత) బంధమునకును భేదమున్నది. ఇందు నాయకుడు ఉన్నతమైన వేదికమీద కూర్చొని భార్య మోకాళ్ళ వద్ద చేతులుంపగా నామె అతనిని కంఠాలింగన మొనర్చుకొని పిఱుదుల పైకి క్రిందికి డోలవలె నాడించును. ఇది విపరీత బంధములలో (Reverse Attitudes) చేర్చదగినదని విజ్ఞుల అభిప్రాయము. 3. వేష్టితకము : భార్య వేదిక మీద కూర్చొని ఒక పాదమును నిలచిన భర్త రొమ్ముపై నుంచి రెండవ పాదముతో నతని చుట్టి కంఠాలింగన మొనర్చుకొనుటయే ఈ బంధ లక్షణము.


వ్యానకరణములు (Prone Attitudes): వ్యానకరణములలోని ధేనుకాబంధము (Bovin Posture) ను నాగరసర్వస్వము, స్మరదీపికలు, పశుబంధ మనిన నేటి పాశ్చాత్య విద్వాంసులు దీనినే Standing Arched Position అనినారు. అరబ్బులు దీనికి 'ఏల్ హౌరీ' అని నామకరణ మొనర్చిరి. వ్యానకరణములలో ఐభ (Elephant mode) ఒకటి. ఐన (Deer) సూకర (Boar) గార్దభ (Ass) బంధములు వ్యాసకరణములై యున్నవి. కాని ఇవి లోకమున కష్టకారణముగనో, లేక సౌఖ్యవ్యతిక్రమములగుట వలననో ఉ పయోగమున లేవు. వాఘ్రావస్కంధమను (Attack of the Tiger) మరియొక వ్యాకరణమున్నది. దీనిని నేటి పాశ్చాత్య విద్వాంసులు 'Wheel Barrow' అనినారు. నియతమనునది ఇదియు నొకటేయనియును నాగరసర్వస్వ వ్యాఖ్యాత త్రిపాఠీ మహాశయుడు వ్రాసియున్నాడు. కానీ అనంగరంగ సంపాదకుడు త్రిదివనాథరే ఈ అభిప్రాయముతో నేకీభవించుటలేదు. (అనంగరంగము పేజి 224). ఈ విధానమున నాయిక పర్యంకమున బోరగిల పరుండి పాదముల పైకెత్తగా ఆమె నడుమ బాణమువలె వంగి కామావయవసీమ కొంత ముందునకు తీసుకొని వచ్చిన భర్త ఆమె తొడలను మరింత పైకెత్తి వాటి కాధారముగా నతని మోకాళ్ళు నిలపి రమించుట ఈ బంధ లక్షణము. అందువలన త్రిదివనాథరే అభిప్రాయపడినట్లు ఇది భారతీయుల వ్యాసకరణమును వాఘ్రావస్కంధమును (Attack of the tiger) పోలుటకు అవకాశము లేదు. ఇది Posterior extended attitudes కు ఉదాహరణము. అనగా ఇది ఉత్ఫుల్లక బంధమునకు Posterior Form అని చెప్పవచ్చును.


ఏతేనైవ యోగేన శాన మైనేయం ఛాగలం గార్దభాక్రాంతం మార్జాల లలితకం వ్యాఘ్రావస్కంధనం గజోపమర్దితం వరాహ దృష్టకం తురగారూఢాదిక మితి యత్ర యత్ర విశేష యోగో అపూర్వస్తత్త దుపలక్షయేత్ (2.6.39) అను సూత్రమును బట్టి వ్యాకరణముల నెన్నిటినైన నూహించి పొందవచ్చునని వాత్స్యాయనుని అభిమతమైనట్లు తెలియుచున్నది.


సంస్కృతి

151