ఉత్థిత కరణములలో నొకటైన జానుకర్పరము (Knee Elbow Pose) నందు నాయిక ఒక ఉన్నతమైన వేదికమీద కూర్చొని ఉండగా నాయకుడు ఆమె పాదములను మోచేతులమీద నిల్పిన తరువాత ఆమె మెడను గాని, దేహమునుగాని ఆలింగన మొనర్చుకొని నిలచి రమించును. భర్త చేతులతో నాయికను కౌగిలింపవచ్చునని నాగరసర్వస్వము. ఉత్థితలింగము పైకినిలిచి రమించుట. జానుకర్పరమని కొక్కోకుడు. అట్టి సందర్భమున నాయిక భర్త శరీరమును మోకాళ్ళతో బంధింపవచ్చునని రతిరత్న ప్రదీపిక చెప్పుచున్నది. హరివిక్రమబంధము (Rampant Lion Pose) కేవలము యౌవనవంతులకు మంచిదని అనంగరంగకర్త చెప్పుచున్నాడు. ఈ బంధమున నాయకుడు పైకెత్తి నాయిక పాదమును చేతులలో పట్టుకొనగా నామె కొంచెము వెనుకకు వ్రాలినట్లుండు ననినాడు. ఈ బంధమునే పంచసాయకము త్రిపాద మనినది. "భార్య మోకాలును భర్త హస్తమున నిల్పి రెండవ పాదము భూమిపైనుండి అతనిని బంధింపగా నతడు ఆమె నాలింగన మొనర్చి రమించుటయే త్రిపాదమట. కామసూత్ర వ్యాఖ్యాత దీనికే వ్యాయితమను నామాంతరమున్నట్లు ఒక శ్లోకమును ఉటంకించినాడు. పద్మశ్రీ వ్యాపారమను నీ బంధ విభేదము నొకదానిని పేర్కొనినాడు. అందు నాయిక ఎత్తిన పాదమును భర్త భుజము మీద ఉంచవలెనట. 'కీర్తి' (Favouring Pose) అని లోకమున ప్రఖ్యాతి పొందిన బంధమునే కామసూత్రకర్త రతిరహస్యకర్తలు అవలంబిత మనినారు. నాగరసర్వస్వము విలంబిత మనినది. పంచసాయకము వ్యతికరమనినది. ఇందు భర్త ఒక కుడ్యమును ఆధారముగా గొని నిలచును. రెండు ముంజేతులను చేర్చి భార్య కూర్చొండుటకు అనువుగా నొక ఆసనమును నిర్మింప దానిపై నామె కూర్చుండి భర్తను పెనవేసుకొని కాళ్ళతో కుడ్యమును ఆధారము చేసుకొని పిరుదుల యలవలె నూపును. ఇట్టి సందర్భముల భార్య విశేషముగా నలసిపోయి సీత్కారమొనర్చుననియు, అధికముగా ఊపిరి విడచుననియును, ఇందుకు పురుషుడు అతిబలశాలి, యువకుడుగా నుండవలయుననియు కొక్కోకుని అభిప్రాయము. దీనినే అరబ్బులు డోక్ - ఎల్ - ఊటేడ్ (Driving the Nail Home) అందురు. మరికొన్ని కామకళా గ్రంథములందు ప్రముఖ గ్రంథములలో కనుపింపని ఉత్థిత కరణములు కొన్ని కానవచ్చు చున్నవి. అవి (1) ద్వితాళము. భర్త నిలచి భార్యను హస్తముతో నామె పాదముల క్రింద నిలిపి పట్టును. ఆమె భర్తను కంఠాలింగన మొనర్చుకొనును. దీనికి భర్త అతిశక్తిమంతుడు కావలసి ఉన్నది. దీనినే నాగరసర్వస్వము అర్పిత మనినది. 2. డోలాబంధము: నాయిక ఎత్తయిన వేదిక మీద కూర్చొని పాదములను ఎదురుగా నిలచిన భర్త రొమ్ములపై నుంచును.
150
వావిలాల సోమయాజులు సాహిత్యం-4