పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహర్షి విసృష్టిని గురించి యొనర్చిన చర్చ యెంతయు సమంజసముగ నున్నది. ఆధునిక జాతిశాస్త్రజ్ఞుల అభిప్రాయములు కానుగుణ్యముగ నున్నది. ఆధునిక వివాహమను గ్రంథమున గ్రిఫ్ఫెత్ మహాశయుడు ఇట్లు వ్రాసి ఉన్నాడు. "స్త్రీ పురుషులకు విసృష్టి సుఖము పరస్పరమున్న కాని పరిపూర్ణ సంభోగ రసానుభవము కలుగదు. మూఢులైన నాయకానాయికలు వ్యక్తిగతముగ స్వేచ్ఛగ విసృష్టి సుఖమును పొందగలుగుదురు, పురుషుని శుక్ర వినిర్గమమునకు పూర్వమే స్త్రీ ఒకటి రెండు మారులు స్యందనము పొందవచ్చునని నేను అంగీకరింతును. కాని ఏక కాలమున నిరువురును పొందిన విసృష్టితో నిది సమము కాదు. శుక్రబహిర్గమను సంభోగము (Coitus Interruptus) నొనర్చువారికి అట్టి విసృష్టి సుఖము లభ్యము కాదు. ఈ అభిప్రాయమునే మహాశయుడు Havelock Ellis ఇట్లు చెప్పినాడు.


“The whole structure of the world is built upon the general fact that the intimate contact of the male and female who have chosen each other is mutually pleasurable. Below this general fact is the more specific fact that in the normal accomplishment of the act of sexual consummation the two partners experience the actual gratification of simultaneous orgasm. Herein it is said, lies the secret of love"


స్త్రీలు వదులు నీ శుక్ర మెచ్చటిదను ప్రశ్న ఉదయించగా మనవారు అది రసధాతుజనితమై అసృగ్ధాతునే (రక్తధాతువు) ఒక స్థితిలో ఆర్తవమనిపించుకొను ననియును, అది మజ్జాధాతువు నుండి పుట్టినదని అభిప్రాయములో పడినారు. పాశ్చాత్య శాస్త్రజ్ఞులలో వాన్ డివెల్డి ఈ విసృష్టి మూలకమైన స్త్రీ శుక్రము బర్తలోనియన్ గ్లాండులనుండి నరముల ఒత్తిడి మూలమున బయటకు స్రవించునని అభిప్రాయ మిచ్చినాడు. కాని అనేకులు సుప్రసిద్ధ వైద్య శిఖామణులు దీనినంగీకరింపక, ప్రాచీనులు చెప్పినట్లు అది మజ్జాధాతు సంబంధమైన దనినారు. స్త్రీ శుక్ర సంబంధమైన అనేక విశేషాంశములు వైద్యశాస్త్రజ్ఞులు వెల్లడించినారు.


'జాతే రభేదాద్దుపత్యోః సదృశం సుఖమిష్యతే, తస్మాత్తథోపచర్యా స్త్రీయథాగ్రే ప్రాప్నుయాద్రతిమ్' అను సూత్రము వలన వాత్స్యాయన మహర్షి జాతిభేద రహితమగు స్త్రీ పురుషులకు సదృశముగనే సుఖము కలుగునని చెప్పియున్నాడు. కండూతి నివారణమును బట్టియును, శుక్రక్షరణమును బట్టియును, స్త్రీలకు కలుగు సుఖము ద్వివిధము. అందును శుక్రక్షరణము స్యందనమని విసృష్టియని మరల ద్వివిధము.


132

వావిలాల సోమయాజులు సాహిత్యం-4