స్యందనము వలన క్లిన్నత, విసృష్టి, మథనముల వలన సుఖము కలుగును. ఇది రతి మధ్యస్థితి. చివర విసృష్టి సుఖము పురుషునివలె స్త్రీకిని పూర్ణముగ లభించును అని ప్రాచ్యుల నిశ్చితాభిప్రాయము. విసృష్టి సంబంధమైన స్థితిని ముత్తెరగులుగ విభజించి దాని స్వరూపమును “The libido may be devided into 3 phases. The anti orgastic, orgastic and post-orgastic phases. During the anti-orgastic stage, the lustful sensation grows by degrees in intensity upto the moment of commencing ejaculation. The libido then remains relatively constant for sometime, the larget last swells then suddenly to the maximum and reaches its acme, the orgasm at the instant of emission అని టాల్మీ మహాశయుడు 'ప్రణయము’ అను గ్రంథమున వ్రాసియున్నాడు. '
ఈ అధ్యాయమున మహర్షి చెప్పిన 'ప్రథమ రతే చండవేగతా శీఘ్రకాంతా చ
పురుషస్య ముత్తరేషు యోషితః పునరేత వేవ విపరీత మాధాతుక్షమాత్' అను
సూత్రములోని అర్థము వలననే బంధవిభేదముల ఆవశ్యకత ఏర్పడినది.
తదుపరి వాత్స్యాయనుడు ప్రీతిలక్షణములను వివరించినాడు. ఆ ప్రీతి
విభేదములు నాలుగు (1) అభ్యాసిక (2) అభిమానిక (3) సంప్రత్యయిక
(4) విషయకములు. ఇందు అభిమానిక ప్రీతి విషయమున 'ప్రకృతే ర్యాతృతీయస్యాః
స్త్రియా శ్చైవోపరిష్టకే తేషు తేషు చ విజ్ఞేయా చుంబనాదిషు కర్మసు' (2.1.74)
గమనింపదగినది. స్త్రీ పురుష ప్రకృతుల రెంటను చేరని తృతీయా ప్రకృతులకును
(నపుంసకులు) ముఖచాపల్యముగల స్త్రీకిని ఔపరిష్టక రతియందును, అట్టివేయగు
చుంబనాదికములందును రాగసంకల్పము వలన కలుగు ప్రీతి అభిమానికము.
సాంప్రయోగికమున ద్వితీయాధ్యాయమున ఆలింగన విచారాధ్యాయముల
చుంబన వికల్పము, నఖరదన జాత్యాద్యధ్యాయములు, దశనచ్ఛేదాద్యధ్యాయములు
తదితరములు.
రతావస్థాపనానంతరము వాత్స్యాయనుడు సంప్రయోగ స్వరూపమును
నిరూపించినాడు. దీనికి చతుష్షష్టి యను నామాంతరమున్నట్లు చెప్పి అందుకు
కారణముగ నొక సూత్రమును వ్రాసినాడు. సంప్రయోగము - (1) ఆలింగనము,
(2) చుంబనము, (3) దంతక్షతము, (4) నఖక్షతము, (5) సీత్కృతము,
(6) పాణిఘాతములు, (7) సంవేశనము, (8) ఉపసృప్తము, (9) ఔపరిష్టకము
(10) పురుషాయితములు.
సంస్కృతి
133