(Impulse) క్రియ (Amount of Stimulus) వీటినిబట్టి ఏర్పడిన రతివిభేదములను ప్రక్క పుటలోని పట్టికయందు విశదముగ కనవచ్చును.
ఈ రతావస్థానాధ్యాయముననే మహర్షి స్త్రీ పురుష విసృష్టి సంబంధమైన రతి
(Orgasm) ని గురించి కొంత చర్చించి ఉన్నాడు. "పురుషునివలె స్త్రీ రతివిషయక
విసృష్టి పొందదను పూర్వచార్యుల మతమును ఖండించి, స్త్రీకిని విసృష్టి సుఖమున్నదని
నిరూపించినాడు. 'పురుషుడు విసృష్టి సుఖమును అనుభవించి కృతకృత్యుడై స్త్రీయెంత
ప్రేరేపించినను మైథున కార్యమునుండి విరమించుచున్నాడు. స్త్రీకి స్వేచ్ఛగ విరమించుట
యనునది లేదు. అందుమూలమున వారికి విసృష్టి సుఖప్రాప్తి పురుషునివలె లేదు.
చిరకాలము భోగించి విసృష్టి సుఖమును పొంది భోగవ్యాపారమును శీఘ్రవేగుడగు
నాయకుడు విరమించిన స్త్రీలు ద్వేషించుచున్నారు. దీనివలన వారికి భావప్రాప్తి ఉన్నదని
వ్యక్తమగుచున్నది. కాని అది విసృష్టి సుఖానుభవము వలన కలిగినదా? లేక స్త్రీలకు
సహజమగు కండూతి ప్రతీకారము వలన కలిగినదా? అని ప్రశ్నించుకొని 'తస్మాత్
సందిగ్ధత్వా దల క్షణ మితి' (2.1.30) స్త్రీ పురుషునివలె రతిని పొందుట లేదనియును
సంయోగే యోషితః పుంసాం కండూతి రపనుద్యతే తచ్చాభిమాన సంపృష్టం
సుఖమిత్యభిధీయతే (2.1.31) అను సూత్రమున కండూత్యపనోదము వలన కలుగునట్టి
అభిమానయుతమైన సుఖస్పర్శనే కారణమునందు కార్యమునుపచరించి అభిమానిక
విధమగు సుఖమని స్త్రీ చెప్పుచున్నదని ఔద్దాలకి అభిప్రాయము. ఆరంభము నుండి
భావమును పొందుననియును, పురుషుడు రతాంతమున శుక్రనిసర్గమున భావమును
పొందుననియు బాభ్రవ్యుడు దానిని ఖండించినాడు. 'ఏత దుపపన్నతరం' అని దానిని
సమర్థించి, వాత్స్యాయనుడు భావప్రాప్తి వలన స్త్రీ తృప్తి, విసృష్టి సుఖప్రాప్తి వలన
గర్భధారణ పొందుననెను. దీనికి జయమంగళ వ్యాఖ్యాత సుశ్రుతాచార్యులవారి 'యథా
నా రీ చ నా రీ చ మైథునాయోపపద్యతే, అన్యోన్యం ముంచతః శుక్ర మవస్థ స్తోత్రజాయతే'
అను శ్లోకము నుదహరించి ఇరువురు స్త్రీలు మైథున మొనర్చుట కారంభించినపుడు
పరస్పరము శుక్రము వదలుట వలన అవస్థి పుట్టునని అందువలన స్త్రీకి విసృష్టి
సుఖమున్నదనియును వ్యాఖ్యానించినాడు. ఈ సందర్భమున 'సురతాంతే సుఖం పుంసాం
స్త్రీ ణాంతు సతతం సుఖం ధాతుక్షయ నిమిత్తా చ విరామే చ్చోపజాయితే' (2,1.40)
అను సూత్రమున స్త్రీకి సురతారంభము నుండి సుఖము కల్గును.
ధాతుక్షయనిమిత్తముగా విరామేచ్ఛ కలుగును అని నిశ్చయించినాడు.
సంస్కృతి
131