ఈ అధ్యాయారంభమున మహర్షి వాత్స్యాయనుడు లింగప్రమాణముల ననుసరించి స్త్రీ పురుష విభేదముల నొనర్చి ఉన్నాడు. తరువాతి కాలమువారు ఇతని మార్గము ననుసరింపక నందికేశ్వర గోణికాపుత్రాదుల మతమున స్త్రీని పద్మిని, చిత్తిని, హస్తిని, శంఖిని- అని చతుర్విధ విభాగము లొనర్చిరి. ఈ విభాగమున కొంత శారీరక లక్షణము (Physical Nature), కొంత మానసిక స్థితి (Psychological Disposition), కొంత జాత్యము (Sexual Temperment) కననగును.
పాశ్చాత్య దేశములందును స్త్రీ జాతి విభాగము అనాదికాలముననే
ప్రారంభమైనది. అది కేవలము వారి మానసిక స్థితిని, సౌందర్యాతిశయములను
అనుసరించునది. ఒవిడ్ మహాశయుడు 'ఆర్స్ అమటోరియా' గ్రంథమున నిట్టి
విభాగమునకు పూనుకొనినాడు. కాని అది విస్పష్టరూపమును పొందలేదు. " ప్లేటో,
సోక్రటీస్ లకు సమకాలికుడును వైద్య శాస్త్రజ్ఞుడు నైన, హిప్పోక్రేటిస్ స్త్రీ పురుష
జాతులను రెంటిని వారివారి స్థితిననుసరించి (1) కంపనశీల (Nervous) (లేక) (2)
వ్యాకుల (Meloncholic) (3) పైత్య (Bilous or Choleric) రక్తవర్ణ, ఉల్లాస
(Sanguines) (4) శోషవాహిక (Lymphatic or Philematic) అని చతుర్విధ విభాగ
మొనర్చి ఉన్నాడు. 2 కెట్షిమర్ మానవుల నందరిని (1) ఉద్వేగులు (Cyclothyme)
(2) అనుద్వేగులు (Schizothyme) అని ద్వివిధ స్థూల విభాగ మొనర్చి, అందు రెంటను
అనేక అవాంతర విభేదము లున్నవని పలికినాడు. మీడియర్ అను ఒకానొక
సాంఘిక శాస్త్రవేత్త (Sociologist) స్త్రీజాతిని వారి మానసికోద్దేశ లక్షణము (Emotional
makeup) ననుసరించి (1) మేహన లక్షణ లేక మాతృలక్షణ (Uterine or Maternal
Type) (2) కామచ్ఛత్ర లక్షణ లేక జాత్యలక్షణ (Clitoroid or Sexual Type) అను
ద్వివిధస్థూల లక్షణము నొనర్చి రెంటిలోను అనేక అంతర్విభేదము లున్నవని
యున్నాడు. ఈ విభాగము లన్నియు దాంపత్యానుకూలతను దృష్టియందుంచుకొని
యొనర్చినవే. నేడు పాశ్చాత్య దేశమున విశేష పరిశోధన జరిగిన మాంసగ్రంథి శాస్త్రము
(Endorinology) ననుసరించినవి. ఈ శాస్త్రానుసారముగ మానవజాతిలోని స్త్రీ పురుష
విభేదములు, అందలి అంతర్విభేదములు - మానసిక జాత్యములు (Psycho Sexual)
రెండును - కొన్ని నాళరహిత మాంసగ్రంథులు (Ductless - Glands) కారణముగ
నేర్పడినట్లు తెలియుచున్నది. ఈ శాస్త్రజ్ఞుల పరిశోధనల ననుసరించి స్త్రీ పురుష
జాతులు రెంటను ప్రధానముగ చతుర్విధములు ఏర్పడినవి - (1) Pituitary Group
(2) Thyroid Group (3) Thymus Group (4) Adrenal Group. వీటినిబట్టి స్త్రీ
పురుష జాతులు స్థూలముగ నాలుగు విధములని ఏర్పడుచున్నది. ఆధునిక జాతి
సంస్కృతి
127