పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రజ్ఞుడు ఔస్ పెస్కీ ఇట్టి విభాగమునకు పూనుకొనక పోయినను, స్త్రీ పురుషులలో నాలుగు జాతులున్నవని అంగీకరించి విశ్వనవ్య రూపము (A new Model of the Universes) అను గ్రంథమున వ్యక్తమొనర్చిన అభిప్రాయములను 'ఆధునిక వివాహ’ గ్రంథకర్త గ్రిఫ్ఫెత్ మహాశయుడు ఇట్లు సంగ్రహించినాడు.


"He says that in Sex-life men and women are devided in to four main types. Union between two wrongly assorted types produces discord and disharmony. Women of the first type, of whom there are few for each man, attract him irresistably, and, if the love is mutual' arouse the maximum of sensation. Women of the second type, of whom there are more, attract him also, but his feelings are more under the control of reason. This is a calmer love, and fits very well into the convensional pattern, passing more easily into friendship and sympathy. Women of the third type leave him indifferent. The feelings are weak, and the first satisfaction usually exausts all interest, and may even change to hostility. Women of the fourth type interest him still less and physical relationship with them contains a tragic element... Nothing is mere painful or immoral than sex relationship without sensations. ”


మానవ వైవాహిక సంబంధము శారీరకము (Physical) ఉద్వేగయుతము (Emotional) విజ్ఞానయుతము (Intellectual) ఈ మాటయందును శారీరకము ప్రాథమిక ప్రాధాన్యమును వహించుచున్నది. మహర్షి వాత్స్యాయనుడు ఈ సత్యమును గమనించి స్త్రీలను మృగి (Doe) బడబ (Mare) కరిణి (She-Elephant) అని మూడు జాతులుగ విభజించినాడు. పురుషులును శశ, వృష, అశ్వజాతులు, స్త్రీ పురుష లింగ ప్రమాణ విభేదముల ననుసరించి నవవిధ రతిభేదములు ఏర్పడుచున్నట్లు 'అత్రాపి ప్రమాణ వదేవ నవరతాని' (2.1.16) అను సూత్రమున వెల్లడించినాడు. వాత్స్యాయన మహర్షి చేసిన విభాగము నందలి మృగి, వాడవ, కరిణులు, లక్షణమును తెలుపలేదు. కాని కొక్కోకుడు, పద్మశ్రీ, వ్యాసజనార్దనుడు దీనిని గమనించిరి. కాని వారు వేరుమార్గమును త్రొక్కిరి. వాత్స్యాయనుని మతము ననుసరించి చూచినచో తరువాత వారి పద్మిని, మృగి, వాడవ, కరిణులలో నేజాతికైన చెందవచ్చును. అదేరీతిగ హస్తిని, చిత్తిని, శంఖినులును. పురుషులను శశ, మృగ, వృష, హయ జాతులుగను, స్త్రీలను పద్మిని (Lotous Woman), చిత్రిణి (Art-Woman) శంఖిని (Counch-Woman) హస్తిని (She-


128

వావిలాల సోమయాజులు సాహిత్యం-4