ఇరువురు స్త్రీలను ఆయుష్కాముడు చేరరాదని వాత్స్యాయన మహర్షి పలికినాడు. ఆధునిక వైద్యశాస్త్రజ్ఞు లెల్లరును నీ విషయములను అంగీకరింతురు. రాబిన్ సన్ అను ఒకానొక వైద్యమహాశయుడు తన "షండత్వము” (Sexual Impotence) అను గ్రంథమున
" శృంగార పురుషులు ఈ రెండుజాతుల వారిని వర్ణింపవలసి యున్నది. వీరిలో
ముఖ్యముగ గనోరియల్ సాల్ పింగిటిస్ గాని, సిప్లిసు రక్తము గాని ప్రవహించుట
వలన షండత్వము కలుగుననుట నిస్సంశయము.” అని వ్రాసి యున్నాడు. 3
దుర్గంధను అగమ్యగ మహర్షి చెప్పి యున్నాడు. ఇట్టివారిని పరిత్యజించుటకు అమెరికా
దేశమున విడాకుల చట్టములో నొక సూత్రమున్నట్లు “విడాకులలో శరీరస్థితి” (Sexual
factor in Divorce) అను గ్రంథము వలన తెలియుచున్నది. బాల లక్షణములు గల
స్త్రీయును అగమ్య. అట్టి స్త్రీని మానసిక శాస్త్రవేత్తలు 'బాలనారి' (Child Woman)
అనినారు. ‘ఆమెలో Electra Complex అను నొకానొక గుణమో లేక స్వజాతి ప్రణయ
లక్షణమో (Homo-Sexual tendency) ఉండునని నిశ్చయించినారు' అని ఆ గ్రంథకర్త
వ్రాసినాడు
అగమ్యా ప్రసంగానంతరము నాయకునికి మిత్రులుగా నుండదగిన వారి
లక్షణములను విశదీకరించి, వారికి కావలసిన దూత లక్షణములను "పటుతా ధార్ష్ట్య
మింగితాకారజ్ఞతా అనాకులత్వం పర మర్మజ్ఞతా ప్రతారణం దేశజ్ఞానం కాలజ్ఞతా
విషహ్య బుద్ధిత్వం లఘ్వీప్రతిపత్తిః సోపాయా దూతగుణాః (1.5.40) అను సూత్రమున
నిబద్ధించినాడు.
త్రివర్గ విద్యాసముద్దేశముల మూలమున గుణములనొంది ఆత్మవంతుడై స్వరూప
జ్ఞానము కలిగి 'ఆత్మవాన్ మిత్రవాన యుక్తః భావజ్ఞో దేశకాలవిత్, అలభ్యా మ
ప్రయత్నేన స్త్రీయం సంపాదయే న్నరః' అని ప్రథమాధికరణ ప్రయోజనమును
సంక్షేపించినాడు.
సాంప్రయోగికము ద్వితీయాధికరణము వెనుకటి అధికరణమున "స్త్రీయం
సంసాధనయే న్నరః” అని చెప్పి ఆ ఆవాపమును వివరించుటకు ముందు సాంప్రయోగిక
తంత్రమును మహర్షి వివరించినాడు. ఇది ప్రమాణాదుల మూలమున జ్ఞాతరూపము.
లింగసంయోగాదుల కంటే ముందు భావకాలము అనునది కామశాస్త్ర ప్రమాణము.
దీనిని బట్టి చేయదగిన రతావస్థాపనమును మున్ముందు విశదము చేయుటకై,
సాంప్రయోగమున రతావస్థాపనమును ప్రథమాధ్యాయ మొనర్చినాడు.
126
వావిలాల సోమయాజులు సాహిత్యం-4