ఒకనాడు ఉద్దాలకి కుమారుడు శ్వేతకేతువు, తల్లిని ఒక బ్రాహ్మణుడు కామతృప్తి కొరకై ఎత్తుకొని పోవుచుండగా తండ్రి వలన 'ఆ రీతిగా సంఘములలో సమస్త పురుష సంయోగము వలన స్త్రీలు అపవిత్రలు కారను మాటలు విని కోపించి, అది పాపమని నిశ్చయించి, భర్త అనుమతి లేనిది నియోగము నైన పొందరాదని నిర్ణయమొనర్చినాడు" అని భారత కథనము. దీనిని పరికించినచో అతి ప్రాచీన కాలమున భారతదేశమున ఎట్టి వ్యవస్థయును లేక వివక్షారహిత కామోపభోగము (Sexual Promiscuity) లక్షణముగా నున్నప్పుడు, కొన్ని వైవాహిక నిబంధనలను (Marriage Laws) ఏర్పరచిన మహానుభావుడు శ్వేత కేతువని నిశ్చయింపవలసి ఉన్నది.
బాభ్రవ్యుని గ్రంథభాగములు వాత్స్యాయనుని నాటికి నిలచి ఉన్నట్లును, అతడు ఆ గ్రంథమునుండి కొన్ని సూత్రములను, విషయములను సేకరించినట్లు కామసూత్రముల వలన తెలియుచున్నది. కామసూత్రముల వలనను, తద్వ్యాఖ్యానమైన జయమంగళము వలనను దత్తకుడు మాతృమరణానంతరము దత్తుడైనాడని తెలియుచున్నది. ఇతడు మగధలో వీరసేనాది గణికలవలన అనేక విషయములను గ్రహించి శాస్త్ర కర్త ఐనాడు. 'వైశికము' ఇతని గ్రంథము. దత్తకాచార్యుని గ్రంథ మీ నాడుత్సన్నమైనది. కాని సంస్కృత భాణములందు ఇతని గ్రంథమునకు సంబంధించినవి కొన్ని సూక్తులు కానవచ్చుచున్నవి. నరేశ్వర దత్తుని ధూర్తవిట సంవాదము,' అతని కుమారుడగు శ్యామిలకుని పాద తాడితము లకు భాణముల దత్తక సూత్రప్రశంస ఉన్నది. వేదములు 'ఓం' కారముతో నారంభించి ప్రారంభమైనవని వ్యంగ్యగర్భితముగ పలికిన పాదతాడితక వాక్యము గమనింప దగినది. క్రీ.శ. 380 ప్రాంతమున కళింగదేశ పాలకుడైన గాంగవంశ రాజన్యుడు రెండవ మాధవ వర్మ దత్తక సూత్రములకు శ్లోకమయ వ్యాఖ్యానము వ్రాసినాడు. అందు రక్త, విరక్త, వేశ్యలను గురించియు, శయనోపచారాదికములను గూర్చియు వ్రాసిన రెండు పాదముల గ్రంథము మాత్రమే ఉపలభ్యమాన మగుచున్నది. కామ కళాభిజ్ఞులు మాధవవర్మ గ్రంథము దత్తక సూత్రములకు సంగ్రహ గ్రంథముగాని వ్యాఖ్యానము కాదని అభిప్రాయ పడుచున్నారు.
చారాయణ, సువర్ణనాభ, ఘోటక ముఖ, గోనర్గీయ, గోణికాపుత్రులను గురించి
ఎట్టి విశేషములును తెలియుట లేదు. కోసల దేశాధిపతి అగు దీర్ఘచారాయణుడొకడు
అర్థశాస్త్ర రచయిత ఐనట్లు బౌద్ధుల మధ్యమనికాయము వలన తెలియుచున్నది.
ఫోటకముఖుడును అర్థ శాస్త్ర పండితుడైనట్లు కౌటిల్యుని గ్రంథము వలన
____________________________________________________________________________________________________
112
వావిలాల సోమయాజులు సాహిత్యం-4