వ్యక్తమగుచున్నది. స్త్రీలను చతుర్విధములుగ విభజింప నారంభించిన వాడితడే. కొక్కోక పండితుడు ఇతని గ్రంథమును చూచినాడు. కూచిమారుడు ఈ శాస్త్ర గ్రంథకర్తలలో ఉచ్ఛశ్రేణికి చెందినవాడు. అతని గ్రంథము ఉపనిషన్నామములతో విఖ్యాతమైనది. అతని మహర్షిగా పూర్వులు పరిగణించినారు.
దత్తకాచార్యుని తరువాత పేర్కొనదగిన కామశాస్త్ర ప్రణీత వాత్స్యాయన మహర్షి
వాత్స్యాయనుని కామసూత్రములు గురించి విపులముగ తదుపరి ప్రశంసించుటచే
నిక అతని యనంతరము జన్మించిన కామశాస్త్రములను దిజ్మాత్రముగ పేర్కొనుట
అత్యావశ్యకము. అందు దామోదర గుప్తుని కుట్టనీ మతము ప్రప్రథమమున చెప్పదగినది.
దీనికి శంభళీమతము అను నామాంతర మున్నది. ఇతడు కాశ్మీర దేశమును పాలించిన
కర్కోటక వంశజుడగు జయాపీడదేవుని (క్రీ.శ. 779-813) మంత్రిసత్తముడు. ఇందు
1060 శ్లోకములున్నవి. ఈ గ్రంథము ప్రధానముగ వాత్స్యాయన మహర్షి
షష్ఠాధికరణమును (వైశికము) విపులీకరించుచున్నది.
నాగర సర్వస్వకర్త పద్మశ్రీ అతని డెబ్బది రెండవ అధ్యాయమున కుట్టనీమత
ప్రశంస ఒనర్చుటచే నితడు దామోదరగుప్తుని తరువాత వాడని తెలియుచున్నది.
ఇతడు బౌద్ధ సన్యాసి. ఇతని గ్రంథము క్రీ.శ. 1351 నాడు జన్మించిన శార్ఙ్గ ధరపద్ధతిని
ఉటంకించుటచే, పద్మశ్రీ క్రీ.శ. 10 - 11 శతాబ్దముల నాటివాడని పండిత
ప్రకాండుల అభిప్రాయము.
క్రీ.శ. 1029-1064 మధ్య కాలమున కాశ్మీర రాజ్యము నేలిన అనంత దేవుని
సభాసదుడైన క్షేమేంద్ర మహాకవి వాత్స్యాయన సూత్రసారమును, సమయమాత్రకమును
వ్రాసి యున్నాడు. సమయ మాత్రకము కుట్టనీమతము ననుసరించిన శ్లోకమయ
గ్రంథము.
తరువాత చెప్పదగిన కామకళాగ్రంథకర్త కొక్కోకుడు. ఇతడు అద్వితీయ పండిత
వంశమున జన్మించిన సింహళ దేశీయుడు. గద్య విద్యాధర, వైద్య విద్యాధర
బిరుదాంచితుడగు తేజోకుని పుత్రుడు. పరాభద్రుని వంశస్థుడు. ఇతని రతిరహస్యము
కామశాస్త్ర గ్రంథములలో విశేష ప్రాధాన్యము వహించినది. ఇది కల్యాణమల్లుని
అనంగరంగమునకు మూలగ్రంథము. వాత్స్యాయన కామసూత్ర వ్యాఖ్య
జయమంగళమున నీతని రతిరహస్య ప్రశంస కనుపించుచున్నది. అందువలన నతడు
యశోధరునికంటె ప్రాచీనుడని నిశ్చయింపవచ్చును. క్రీ.శ. 1307 నాటి జనప్రభసూరి
అతని కల్పసూత్రములలో జయమంగళ వ్యాఖ్యను పేర్కొనినాడు. అందువలన
____________________________________________________________________________________________________
సంస్కృతి
113