పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిద్రావైచిత్రి


98. శ్రీ కుప్పయాచార్యులవారు - పూర్వము ఆంధ్ర క్రైస్తవ కళాశాలా సంస్కృతాంధ్ర భాషా పండితులు,

99. ఫిన్నిష్ జాతి - యూరప్ నందలి ఫిన్లాండు దేశవాసులు

100. ఆర్యక్షేమేశ్వరుఁడు (క్రీ.శ. 10వ శతాబ్ది ప్రాంతము) నిద్ర మనోమాలిన్యము -

"చిత్తం ప్రసాదయతీ లాఘవ మాదధాతి
ప్రత్యంగ ముజ్జ్వలయతి ప్రతిభావిశేషమ్ |
దోషా నుదస్యతి కరోతి చ ధాతుసామ్యం
ఆనంమర్పయతీ యోగవిశేష గమ్యం ॥

101. కంటికి నిద్ర - కాశీఖండము ఆ. 1, ప. 108 - 101A. అలుక యెత్తినవానికి - భారతము సౌప్తికపర్వము ఆ.1

102. హెరడోటస్ (క్రీ.పూ. 484 - 424) గ్రీకు చరిత్రకారుఁడు. ఆసియా మైనరులోని కపడోసియాలో జన్మము. గ్రీకులకును పారశీకులకును జరిగిన యుద్ధమును తొమ్మిది సంపుటముల చరిత్రగ అయోనిక్ మాండలిక భాషయందు వ్రాసినాఁడు. ఇతని చరిత్ర ప్రాచీన చరిత్రకొక యుత్తమ సాధనము

103. కేటో - (క్రీ.పూ. 183 ప్రాంతము) రోమను రాజనీతిజ్ఞుఁడు, సేనానాయకుఁడు, రచయిత, వ్యవసాయముపై 'డిరెరెస్టికా' యను గ్రంథమును వ్రాసినవాఁడు.

104. అగస్టస్ సీజరు రోమక సామ్రాజ్య చక్రవర్తి. ఎగ్రిపా - క్రీ.పూ. 63 - జూలియస్ సీజరు వధానంతరము వచ్చిన యుద్ధములఁ బైకివచ్చిన సేనాని

105. వాటర్లూ యుద్ధము - (వాటర్లూ బ్రూసెల్సుకు 11 మైళ్ళదూరమున నున్న నగరము) బ్రిటిష్వారికి ఫ్రెంచివారికి 18 జూన్ 1815న యుద్ధము ప్రారంభమైనది. తుదకు నెపోలియన్ లొంగిపోవుటతో 15 జులై 1815లో నంత మొందినది. నెపోలియన్ హెలీనాద్వీపమున ఖైదీయైనాఁడు. నెపోలియన్ - (క్రీ.శ. 1769 - 1821) ఫ్రెంచి చక్రవర్తి. సామాన్య సేనాధికారి పదవినుండి చక్రవర్తియైనాఁడు. The greatest adventurer in the world.

106. బిస్మార్కు - క్రీ.శ. 1879లో నైరోపాయందు మహత్తర వ్యక్తి. బెర్లిన్ కాంగ్రెస్ అధ్యక్షుడు 'Man of Blood and Iron' రెమిని జెన్సెస్ - ఇతని యుత్తమరచన. హంబోర్డు (క్రీ.శ. 1769-1855) యువకుఁడుగ దేశయాత్రలు చేసి తుదకు ఖనన శాస్త్రప్రవీణుఁడై బహుదేశముల నా శాస్త్రమునకు వృద్ధి కల్పించినవాఁడు. తన యాత్రల చరిత్ర ముప్పది యుద్ధంథములుగ రచించినాడు. చర్చిలు (క్రీ.శ. 30 నవంబరు 1874) క్రీ.శ. 1900లో బ్రిటిష్ పార్లమెంటున బ్రవేశించి ____________________________________________________________________________________________________

మణిప్రవాళము

103