నేఁటివరకు నవిచ్ఛిన్నముగ సభ్యుఁడైన యాంగ్ల రాజకీయవేత్త, నేఁటి యాంగ్లేయ ప్రధానమంత్రి
107. నెబ్రాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రములలో నొకటి. లింకన్ దీని ముఖ్య నగరము
108. యోగకుండల్యుపనిషత్తు - కృష్ణయజుర్వేదీయము లైన ముప్పది రెండు ఉపనిషత్తులలో నిది యొకటి
109. సుశ్రుతము - సుశ్రుతాచార్య రచితమైన వైద్యశాస్త్రము
110. అవంతి సుందరి - దండి దశ కుమారచరిత్రమున నొకపాత్ర
111. ఒక దాని వెనుక నొకటి - ఆంగ్లమహాకవి వర్డు వర్తు (క్రీ.శ. 1770-1850) సుప్రసిద్ధ ప్రకృతికవి. క్రీ.శ. 1806లో నిద్రను గూర్చి మూఁడు కావ్యములఁ జెప్పినాఁడు. ఇది యందొక దాని కనువాదము
112.ధ్యానీబుద్ధ - జ్ఞానము నుపదేశించు బుద్ధమూర్తికి బేరు ప్రజ్ఞాపారమిత జగత్ప్రసిద్ధి నొంది నేఁడు జావాయందున్న యొకానొక బుద్ధమూర్తి
113.సంధ్యా సమయ సూర్యు "యాథాగార్గ్య - మరీచయో౽ర్క న్యాస్తం - ఇత్యాది” ప్రశ్నోపనిషద్వాక్యములు మూలము
114. అభినవోన్మేష చిహ్నంబైన - కాశీఖండము ఆ. 3, ప. 22
115. రాయలు క్రీ.శ. 1509-30ల మధ్య విజయనగర సమ్రాట్టు, ఆముక్తమాల్యద కర్త. సాంధ్యరాగలహరి - ఆముక్తమా. ఆ. 4, ప. 139.
స్తోత్రపాఠము
116. షోడశోపచారములు ధ్యానావాహనాదులు
117. సాహిత్యకులందు - బిల్హణీయములోని "నైవ వ్యాకరణజ్ఞమేవ పితరమ్” ఇందుకు మూలము
118. బండి గురవింద పూలు బిల్హణుని విక్రమాంక చరిత్రలోని క్రింది శ్లోకము మూలము :
"కిం చారుచరిత్ర విలాస శూన్యాః
కుర్వంతి భూపాః కవి సంగ్రహేణ |
కింజాతు గుంజాఫల భూషణానామ్
సువర్ణకారేణ వనేచరాణామ్ ||"
119. చౌడప్ప - సుప్రసిద్ధాంధ్ర తిట్టుకవి
120. ఎవ్వాని వాకిట - ఇందు తిక్కన ధర్మరాజును వర్ణించినాఁడు - విరాట పర్వము ఆ. 2 ____________________________________________________________________________________________________
104
వావిలాల సోమయాజులు సాహిత్యం-4