Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/910

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ సమాధానమును విని మంత్రులును రాణాయును ఆశ్చర్యమున మునిగిరి. రాణాకు తప్పునది ఏమియు లేదు. తనను కడుభక్తితో కొలుచుచున్న హారాశాఖీయులు అందరును నేడు మరణింతురు. లేదా తన ప్రతిజ్ఞ నెరవేరవలెనన్న ప్రాణములు పోగొట్టుకొనవలయును. తనకు మించిన దానము ఏమి ఉన్నది?

రాణా కట్టుదిట్టములలో ఆ దుర్గమును ముట్టడించి హారాశాఖీయులను తుదముట్టించి దుర్గమును గ్రహింప నిశ్చయించెను. లేకున్న అతని ప్రాణములు నిలుచునట్లు లేదు.

మరికొంత క్రొత్త సైన్యమును తెప్పించి ముట్టడి ప్రారంభించెను. యుద్ధము భయంకరముగ సాగినది. బైర్సీ సైన్యము తగిన శిక్షణ లేనివారు అయ్యును వారు కాలాగ్నిరుద్రుల వలె పోరాడిరి. వారి ధాటికి తాళజాలక రాణా సైన్యములో ఎందరో మడసిరి.

రాణా ఘోరముగ పోరాటము సాగించెను. హారాశాఖీయుల సంఖ్య క్రమముగ తరిగిపోవుచుండెను. కాని వెన్నిచ్చి ఒక్కరును పారిపోవుట లేదు. తుదివరకు బైర్సీ సైన్యము సాహసముతో పోరాడెను. కొంతకాలము తీవ్రయుద్ధము జరిగిన పిమ్మట నాయకుడగు బైర్సీ తప్ప అందరును మడిసిరి. బైర్సీకి తీవ్రముగా గాయములు తగిలెను.

రాణా దుర్గమును స్వాధీనము చేసికొని వేగముగ బైర్సీని కలుసుకొనెను. బైర్సీ బాధతో "ప్రభూ! ఇంతకాలము మీ కొలువులో ఉంటిమి. మీ ఉప్పు తింటిమి. తుదకు మీతో పోరాడితిమి. దేశభక్తి మమ్ము ఇట్లు ప్రేరేపించినది" అని వినయముతో పలికెను.

ఈ యుద్ధము రాణా హృదయమున గొప్ప మార్పును కలిగించెను. "బైర్సీ! నీ జాతి సాహసమునకు మెచ్చితిని. దేశముకంటె మించినది ఏమున్నది? జననియును జన్మభూమియును స్వర్గముకంటె అధికమైనవి. మీ బాధ నాకు అర్థమైనది. చింతపడకుము, ఈ నాడు నాతో పోరాడిన నీ మిత్రులు వీర స్వర్గమును అలకరింతురు” అని బైర్సీని మంచిమాటలలో రాణా సంతోషపెట్టెను.

బైర్సీ గాయములో బాధపడుచు "ప్రభూ! నన్ను మృత్యువు ఆహ్వానించుచున్నది. ఈ తుది క్షణమున నాదొక కోరిక ఉన్నది. దానిని తాము కాదనక తీర్పవలయును” అని రాణాకు ప్రార్థించెను.