Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/907

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తనకడ ఉన్న కొలది సైన్యముతో బుందీ ప్రభువు మరణమునకు కూడ సిద్ధపడి చిత్తూరు రాణా సైన్యముపై బడెను. అర్ధరాత్రి సమయము, స్థలము రాణా సైన్యమునకు పరిచితము కానిది. బుందీ సైన్యము ప్రమథగణములవలె పోరాడిరి.

చిత్తూరు రాణాసైన్యము వారి ధాటికి ఆగలేకపోయిరి. ఓడిపోయిరి. చిత్తూరుకు పారిపోయి, ప్రాణములు కాపాడుకొనుట తప్ప వారికి మరియొక మార్గము లేకపోయినది. సేనకు నాయకుడైన రాణాకును పలాయనమే గతియయ్యెను.

బుందీ సంస్థానము తన రాజ్యముతో పోల్చిన ఎంత చిన్నది! దాని సైన్యము ప్రచండమైన తన సైన్యముతో పోల్చిన ఎంత? అట్టి స్థితిలో తనకు ఓటమి కలిగినది. చిత్తూరు రాణాకు ఇది భరింపరాని అవమానముగ తోచెను. ఆ అవమానము అతని యందు క్రోధముగ పరిణమించినది.

“బుందీకోట దహించి నేలమట్టము అగుట చూచిగాని నేను భుజింపను, అంతవరకును ప్రాయోపవేశమొనర్చెదను!” అని చిత్తూరు రాణా మనస్సున నిశ్చయించెను. మంత్రులకును సేనాధిపతులకును ఈ విషయము తెలియజేసెను.

వారు రాణా చేసిన ఘోరమగు నిర్ణయమునకు భయముచే కంపించిరి. అనేక విధములు చెప్పి ఆ నిర్ణయమును మాన్పుటకు వారు ప్రయత్నించిరి. కాని ప్రయోజనములేదు. రాణా ప్రాయోపవేశ మొనర్చెను. 'దండయాత్రకు బయలుదేరుడు' అని సైన్యమునకు ఆజ్ఞ నొసంగెను.

రాణా ప్రాణములు దక్కవలయునన్న స్వల్పకాలములో బుందీని జయింప వలయును. అది అంత సులభముగ సాథ్యపడదు. అదియునుగాక రాణా ప్రాయోపవేశమును గూర్చిన వార్త బుందీ ప్రభువుకు తెలిసినది. బుందీని ధైర్యము సాహసము కల సైనికులు కడు జాగరూకతతో రక్షించుచున్నట్లును వార్తలు వచ్చినవి. నిప్పుకు గాలి తోడ్పడినట్లు బుందీ ప్రభువునకు హారావతి పాలకుడు సాయము వచ్చెను. ఈ వార్త చిత్తూరు చేరెను.

చిత్తూరు రాణా ప్రాయోపవేశమును గూర్చి మంత్రులు ఆందోళనపడిరి. సభచేసి మంచి చెడ్డలు తర్కించిరి. ఎట్లైనను వారు బుద్ధికుశలత కలవారు. రాజు మాట అబద్ధము కాకూడదు. బుందీ సైనికులలో ఒక్కని కుత్తుకయందు ప్రాణము ఉన్నంత


కదంబము

907