ఈ పుటను అచ్చుదిద్దలేదు
ధర్మగుప్తుడు మర్యాదరామన్న తీర్పునకు సంతోషించి జయకొట్టెను.
సభాసదులు "ఇది ఘనమైన తీర్పు! ఇట్టి మిత్రద్రోహులు రాజ్యద్రోహముకైన వెనుదీయరు. ఇట్టివారు సంఘమున ఉన్న అనుమానము ప్రబలిపోవును. జనుల జీవితమునకు ఆటంకము కలుగును. రామన్నగారు తగిన శిక్ష చెప్పిరి” అని ప్రశంసించుచు ఇండ్లకు వెడలిరి.
హరగుప్తునికి తన మిత్రద్రోహము, దురాశ తెలిసి వచ్చినవి. తల తాకట్లు పెట్టి ఐనను పదమూడు వేల అయిదు వందల నాణెములను చెల్లింపవలయును. లేకున్న శూలమును ఎక్కవలెను. చేసిన తప్పిదమునకు శిక్ష చెల్లించుట ధర్మము. కాని అతనికడ నేడు ధనము లేదు. అతడు దానిని సంపాదించుటకు ఎంతయో కష్టపడెను. దుఃఖముల పాలయ్యెను.
మిత్రద్రోహము మహాపాపము, దురాశ దుఃఖమునకు చేటు.