Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/718

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురిపెట్టి చెండుకోలకు దగులునట్లు కొట్టలేకున్న పక్షమున మరణించిన వారొకరు జీవింతురు.

చెండును గొట్టుట ధ్వజకేతువు పక్షమువారికి వచ్చినది.

ఆట ప్రారంభమైనది. కొలది కాలములోనే ధ్వజకేతువు పక్షమున మంగళుడు, శాతకర్ణి, యతడు తప్ప నందరును మరణించినారు. మంగళుడు కోలతో గుంటయొద్ద నిలిచి యిరువుర బ్రతికించినాడు. కాని వెంటనే వారు మరణించినారు. తరువాత మంగళుడు ధ్వజకేతువు మరణించినారు.

ఆట యంతయు శిఖిపై నాధారపడియున్నది. అతడు కందుకమును జుక్కలు జూచునట్లు కొట్టినాడు ఏకశృంగుని పక్షము వారు పరుగెత్తిదానిని పట్టుకొనుటలో శ్రమపడి యలసి పోవుచున్నారు. వారి గురి తప్పిపోవుచున్నది. శాతకర్ణి క్రమముగ నందర బ్రతికించినాడు. ధ్వజకేతువు పట్టరాని సంతోషముతో గేకలు పెట్టినాడు.

సూర్యాస్తమయమైనది. ఆట చాలింపుడని కామాయిని భిక్కుని యాదేశించినది. ధ్వజకేతువున కాదిన మాటలో నఖండ విజయము. ఏకశృంగుని పక్షము పూర్వమెన్నడు నట్టోడిపోలేదు. శాతకర్ణిని మంగళుడు, ధ్వజకేతువు భుజములపై నెక్కించుకొని కొందరు విద్యార్థుల హర్షనినాదములతో నాలంద వీథులం దూరేగించినారు.

క్రీడారంగమున నతడెంతటి ప్రజ్ఞ జూపించిననేమి? శాతకర్ణి విద్యావిషయకముల వెనుకబడియున్నాడు. అతని కాత్మగౌరవములు లుప్తమగుచున్నవి నిరాశ యతని గలత బెట్టుచున్నది. గయా శీర్షుడొసగుచున్న శిక్షలకంతము లేదు. కొయ్యపలకపై నిత్యము తేనెబలపము అరిగిపోవునట్లు పాఠముల వ్రాయుటచే జేతులు కాయలు గాయుచున్నవి. విద్యలో నిరర్థకుడనిపించుకొనుట కతని కిష్టములేదు. ఎంత శ్రమించిన నతడు స్నేహితులతో సరిపోలలేకున్నాడు. 'చండ్రమొద్దు' 'చాకిబండ' మొదలైన తిట్లకు దలబొప్పులు కట్టుచున్నది. 'నన్నుకాదని' త్రోసి వేసుకొని తిరుగగల తత్త్వమతనికి లేదు. సహజముగ నతడు తెలివితక్కువ వాడైన నెంతో బాగుండెడిది!

అట్టిస్థితిలో దండ్రి యొద్దనుండి యుత్తర మొకటివచ్చినది. అదియతని వ్యాకుల హృదయమును మరింత కలత బెట్టినది. తన సంగతి తండ్రికి దెలిసినందు కతడు చింతపడి కన్నీరుగార్చినాడు. 'పాణినీయ శిక్ష'లో బాఠమును గంఠస్థ మొనర్చనందు