నాటపాటలలో బాల్గొన నీయడు. ఆయన విధానమునకు మార్పులేదు విద్యార్థుల శక్తి సామర్థ్యముల గమనించిగాని, వారి మానసిక స్థితిగతులు బరిగణించిగాని యది పరివర్తన నొందదు.
చింతన యన శాతకర్ణి మనస్సు చెప్పినమాట వినదు. అతడు పదిమందిలో గలసి చదువుట కలవాటు పడలేదు. నిశ్శబ్దమున గాని యతని చిత్తము నిశితముగ బనిచేయదు. అతడు సకాలమున కొకమారైన పాఠముల బూర్తియొనర్పలేక పోవుచున్నాడు. నిరంతరమును వల్లింపలేని పాఠముల జూచి వ్రాయుటలో నతనికాలమంతయు వ్యర్థమగుచున్నది. గయా శీర్షుడతని 'నిరర్థకు'డని నిర్ణయించి శీలభద్రునితో విన్నవించినాడు. ఆ సంగతి చెవినిబడిన తరువాత శిఖి చిత్తము పరిపరి విధముల బరితపింప నారంభించినది.
ఆనాడతడు కక్ష్యలో వేదికపై నేకాంతముగ కూర్చుండి దీర్ఘముగ నాలోచించు చున్నాడు. అతని ముఖమున దైన్యము తొణికిసలాడుచున్నది.
విద్యార్థులందరును కనుల యెదుట క్రీడాభూమిలో కందుక కేళి కాయత్తపడు చున్నారు. మంగళుడు, ధ్వజకేతువు శిఖిని బిలుచుకొనిపోవనతని కక్ష్యకు వచ్చినారు.
"ఆటలో నీవు పాల్గొనుట లేదా?”
“లేదు. పాల్గొనవచ్చునని తెలియదు” “ఇప్పటికైన మించిపోయినది లేదు. కామాయనీ భిక్కునికి జెప్పి నీ పేరును జేర్పింతుము రమ్ము” అని శాతకర్ణి నుత్సాహపరచి వారిరువురు నతనితో క్రీడాభూమిని చేరుకొని రంగస్థలమున బ్రవేశించినారు.
ధ్వజకేతు నొక పక్షమునకు, ఏకశృంగుడొక పక్షమునకు నాయకులు. 'జాగ్రత్తగ నాడవలె సుమా! మనలో నొకరైన మరణింపరాదు' 'మా శక్తికొలది యత్నింతు మని మంగళుడు, శాతకర్ణి యతనికి సమాధానమిచ్చినారు.
కందుక క్రీడలో రెండు పక్షములుండును. నేలమీద చిన్నగుంటను ద్రవ్వి దానియొద్ద నుండి యొక పక్షమువారు విసరుచుండును మరియొక పక్షము వారు కోలతో గురితప్పక గొట్టవలెను. ముమ్మారు తప్పిన నా పక్షమున నొకరొకరే మరణింతురు. రెండవ పక్షము వారు కందుకమును వారిలో వారి కందించుకొనుచు గుంటకు కొంతదూరమున నిల్పిన కోలకు దగులునట్లు వేయవలెను. తగులకున్న మరలను జెండుకొట్టుదురు. తగిలిన, వారిలో నొకరు చనిపోయినట్లు. ముమ్మారు