Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/716

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'సరే కానిమ్ము. ఇది సమయము గాదు. నేను బుద్ధపూజ కేగవలె'నని సాకుజెప్పి యతడు వెళ్ళిపోయినాడు.

అమితాభుని గలుపుకొని శిఖి శాతకర్ణి బుద్ధ పూజ యొనర్చి తిరిగి విద్యామందిరము జేరుకొనినాడు.

"శిఖీ! మనమెక్కడి కేగవలెను?"

“నేనును క్రొత్తవాడను. నాకును దెలియదు.” వారిరువురకును దూరమున మంగళుడు కనిపించినాడు. అతనిని బిలచి ప్రశ్నింపనాతడు వారికి కాశ్యపుని విద్యామందిరమును జూపించినాడు. ఇరువురు మిత్రులును నటకు జేరుకొనినారు.

కంఠస్థ మొనర్చిన పాఠముల విద్యార్థులు గయాశీర్షునకు వినిపించుచున్నారు. శాతకర్ణివంతు వచ్చినది.

"క్షమింపుడు. నేను క్రొత్తవాడను. గ్రంథము లేదు”.

"క్షమింపుడు. క్రొత్తవాడను. గ్రంథము లేదు" అని యా యుపాధ్యాయుడు శిఖిని వెక్కిరించి యధికార పూర్వకముగ 'రేపటికి వినిపింపకున్న నూరుకొనను. ఆదిలోనే హంసపాదా? ఈనాటి పాఠములన్నియు ఫలకముపై వ్రాసిజూపింపు'మని కఠినముగ శాసించినాడు.

'చిత్త'మని నమస్కరించి శాతకర్ణి యథాస్థానమున గూర్చొనినాడు.

అది శుక్లపక్షమే కాని శాతకర్ణికి కృష్ణపక్షము వలె నున్నది. పూర్వమాతడు కంఠస్థ మొనర్చుట కలవాటు పడలేదు. వ్యాకరణమనిన నతనికి వెగటు. అతని మూల పురుషులలో నొకడైన హాలశాతకర్ణి సంకలన మొనర్చిన 'సప్తశతి'లోని గాథలన్న నతని కభిమాన మధికము. వానినే యతడు ముఖస్థ మొనర్పలేదు. నాలందలో వ్యాకరణమునకు విశేష ప్రాధాన్యము. శబ్దార్థ వివరణమున సమస్త ప్రపంచమును విద్యార్థులకు బరిచయ మొనర్చు నవకాశము గలుగును. అందువలన దాని కాచార్యులు ప్రథమస్థాన మిచ్చినారు. నాలంద విద్యావిధానము శాతకర్ణికి నచ్చలేదు. మనస్సు వ్యాకులపడ జొచ్చినది. అతని కసంతృప్తి యారంభించినది.

విద్యార్థులెవరైన బాఠముల ముఖస్థ మొనర్చి వినిపింపలేకున్న గయాశీర్షునకు మరుసటిదిన మొప్పజెప్పిన జాలదు. వారిచే ఫలకముపై వానిని వ్రాయించును. పెట్టిన గడువులో వ్రాసుకొని రాకున్న మరల మరల వ్రాయించును. అట్టి విద్యార్థుల