Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

60. 61. 62. 63. 64. ప్రతిఫలంగా అతడు తన సైన్యంలో క్రొత్తగా చేరిన మెనాస్ మొనక్రేట్స్ వంటి ఉత్తములను శత్రువుల పరంచేసి కీర్తిని కోల్పోటం, రోముకు గోధుమపంట ఇవ్వటం వల్ల క్షామపీడితులౌతున్న శత్రువులకు ఆహారాన్నిచ్చి పోషించటం జరిగింది. అయితే వినండి : లెపిడస్ అనుభవిస్తున్న స్థానానికంటే అధికమైంది కాకపోయినా, దానితో సాటి అయినదాన్నైనా పాంపే పొందగలిగిన సమయం వచ్చింది. కానీ మెసినమ్ సంధికి ఒప్పుకోటం వల్ల అది పోయింది. ఇలా అంగీకరించి నందువల్ల రక్షణ, అధికారం లభిస్తాయని పాంపే ఆశ పడ్డాడు. కానీ రాజనీతిజ్ఞుడైన సీజర్, అవకాశం చిక్కించుకొని అణగద్రొక్కాడు. దూరదృష్టి లేకుండా ఇతరుల దృష్టిలో నీతిమంతుడు, ఉదాత్తుడు, అనిపించుకోవాలన్న ఆశతో, పూర్ణహృదయంతో వ్యవహరింపని పాంపే జీవితం నిరర్థకంగా అంతం పొందక మరేమౌతుంది? సీజర్ దగ్గిరికి వీపుమీద మోసుకొని తెచ్చాడు : 'ఒక మెత్తలో క్లియోపాత్రాను నిలిపి ఎప్పొలొడోరస్ సీజర్ దగ్గరికి తీసుకోవచ్చాడు' అని నార్త్ అనువదించిన (1579) ఫ్లూటార్క్ చరిత్రలోని మార్జిన్లో ఉంది. అదృష్టంతో పరాచకాలాడుతున్నాడు. సంధిమూలంగా త్రైకూటవీరుల్లో ఒకడైన లెపిడన్ వంటి స్థానాన్ని పొందగలిగే అవకాశాన్ని పోగొట్టుకొంటున్నాడని మెనాస్ భావం. మెనాస్ దృష్టిలో ఫలమే ప్రధానం మార్గం ఏదైనా సరే. వారి స్నేహానికి ఉరిత్రాడు - ఆంటోనీ ఆక్టేవియాను హృదయపూర్వకంగా ప్రేమించటంవల్ల పరిణయమాడలేదు. రాజకీయ ప్రయోజనం కోసం చేసుకొన్న ఈ వివాహం ఎప్పుడైనా విఫలం కాక తప్పదనీ, అందువల్ల అతడికి మరింత క్లేశం కలిగి తీరుతుందనీ ఎనో బార్బస్ అభిప్రాయం. ఆసవశేషం - త్రాగెడివారి పాత్రలో చివరకు మిగిలిన ఆసవభాగం. దీనిని భిక్షుకజనానికి ఇచ్చివేస్తారని ఒక అభిప్రాయం. త్రాగేవారిపనిని సుగమం చేయటానికి, ఇతరమిత్రులు మిగిలిన ఆ పానీయాంశాన్ని పుచ్చుకొంటారని మరొక అభిప్రాయం. 314 వావిలాల సోమయాజులు సాహిత్యం-3