Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

51. 52. 53. 54. 55. 56. 57. 58. 59. గర్గన్ - గార్గన్లు ముగ్గురు అక్కచెల్లెండ్రు. ఫార్సిస్ కేటోల కుమార్తెలు. వీరిలో సుప్రసిద్ద మెడూసా. ఈమె శిరస్సు మహాభయంకరమైంది. దాన్ని చూచిన ప్రతివారూ శిలలుగా మారిపోతారు. మార్స్ : గ్రీకుల యుద్ధదేవత.

ఫిలిప్పీయుద్ధరంగం : మార్క్ ఆంటోనీ ఈ యుద్ధరంగంలోనే బ్రూటస్, కాషియస్లను ఓడించి, సీజర్ హత్యకు ప్రతీకారాన్ని పొందటం జరిగింది. నా జనకుడు : పాంపే తండ్రి ఘనుడైన పాంపే. మొదటి పాలక త్రయకూటమి క్రీ.పూ. 60లో ఏర్పడ్డది. అందులో సభ్యులు జూలియస్ సీజర్, పాంపే, క్రాసస్. క్రీ.పూ. 48లో జూలియస్ సీజర్ పాంపేను థాసల్లీలోని ఫార్సేలియాలో ఓడించి చంపాడు. తరువాత కొలది కాలానికే క్రాసస్ ను అలెగ్జాండ్రియాలో హత్య చేశాడు. బ్రూటస్ : జూలియస్ సీజర్కు మిత్రుడు. రోమక ప్రజాస్వామ్యానికి సీజర్ హత్య అవసరమని భావించి హంతకవర్గనాయకుడై, ఆత్మమిత్రుని హతమార్చిన ఉదాత్తరోమకవ్యక్తి. సభాభవనాన్ని రక్తపంకిలం చేయటం - సీజర్ హత్య నిజానికి రోములోని సభాభవనంలో (కాపిటోల్) జరగలేదు క్యూరియా పాంపేయ్నీలో అతడు నిహతుడైనాడు. జనకుల సౌధాన్ని - ఆంటోనీ ప్రతిఫలమివ్వకుండానే ఘనుడైన పాంపేగృహాన్ని పుచ్చి వేసుకొన్నాడు. అందువల్ల నీవు మోసకారివని ఆంటోనీని, పాంపే కుమారుడైన సెక్స్టస్ పాంపే నిందిస్తున్నాడు. - ఇంతకంటే అధికసంపదను సీజర్ రాజనీతిజ్ఞుడు. ఇట పాంపే హృదయంలో జంకును కల్పించి తమ సంధిషరతులకు అంగీకరించేటట్లు చేయటానికి వేసిన ఎత్తు అతని చతురతను వెల్లడిస్తున్నది. మీరు సిసిలీ: పాంపే విచిత్రమైన వ్యక్తి. ఎక్కువకు ఆశపడి ఎంతో కోల్పోతాడు. ఈ మైసినం సంధిమూలంగా ఇతడు తన సదవకాశాలను కోల్పోయినాడు. రోమకసామ్రాజ్యాన్ని పంచుకోటంలో అతని వంతుకు వచ్చినవి సిసిలీ సార్టీనీయాలు. అవి ఇంతకుముందే అతనివి. ఇందుకు ఆంటోని - క్లియోపాత్రా 313