Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

43. 44. 45. 46. 47. 48. 49. 50. శూన్యతను కల్పించి ఉండవలసింది : ప్రకృతి శూన్యతను గర్హిస్తుందని, రెండు వేలకు పూర్వం గ్రీకులలో సంచారం చేస్తూ తమ తత్త్వాన్ని వ్యాప్తి నొందించిన పెరిపాటటిక్ మతస్థులైన తాత్త్వికుల అభిప్రాయం. జోస్యుడు : ఇతడు ఈజిప్టు నుంచి ఆంటోనీ వెంట రోముకు వచ్చాడు. లావుకాలు : ప్రాచీన సమారిట్లను, చైనీయులు లావుకపిట్టలకు పోటీలు పెట్టి వినోదించేవారని తెలుస్తున్నది. బిల్లియర్డుస్ - ఈ క్రీడ ఆధునికం. దీనిని రోమనుల కాలంలో ఉన్నట్లు చెప్పటం ఔచిత్యం. ఆంటోనీ మరణించాడా? వార్తాహరి తెచ్చిన వార్తను వినటానికి భయపడుతున్న క్లియోపాత్రా అత్యాతురతతో అతణ్ణి చెప్పనీయకపోవటం మానసికవేత్త అయిన షేక్స్పియర్ చేసిన మనోజ్ఞకల్పన. ప్యూరీలా - గ్రీకు పురాణగాథల్లోని క్రోధదేవతలు. వీరు దోషులకు విధించిన శిక్షలను కార్యరూపంలో పెడుతుంటారు. వీరి శరీరాలు కారునలుపుగాను, శిరోజాలు సర్పాన్వితాలుగానూ ఉంటాయి. కన్నుల నుంచి రక్తబిందువులు స్రవిస్తుంటాయి. బంగారాన్ని వర్షిస్తాయి - ప్రాచ్యదేశాల రాజుల పట్టాభిషేక సమయాలలో వారిమీద బంగారు రజనును, పులిముత్యాలను వెదచల్లటం ఆచారం. నార్సిస్సస్ - నదీదైవతమైన సెఫీస్సస్కు, అప్సరస లిరియోప్కు జన్మించిన పుత్రుడు. అందగాడు. ఒక కొలనులో తన ప్రతిబింబాన్ని చూచి ముగ్ధుడై, అది ఆ ప్రదేశంలోని అప్సరస అని భావించి పొందలేక నిరాశపడి, మరణించాడు. దేవతలు అతణ్ణి ఒక పుష్పంగా రూపొందించారు. ఇతని ప్రేమకోసం 'ఇకో' వనదేవత అలమటించి, చివరకు స్వరంతప్ప ఏమీ మిగలకుండా అయిపోయింది. ఈ నిర్దయకు శిక్షగా ఇతడు తన ప్రతిబింబాన్ని తానే ప్రేమించి, వసివాడి, మరణించవలసి వచ్చింది. నిత్యంగా వెళ్ళిపోనీ - ఈ వాక్యాలను క్లియోపాత్రా ఆంటోనీని ఉద్దేశించి పలుకుతున్నది. 312 వావిలాల సోమయాజులు సాహిత్యం-3