36. 37. 38. 39. 40. 41. 42. ఆక్టేవియా మీద ఉన్న అధికారం - ప్రేమగల సోదరుడికి సోదరిపై గల అధికారమన్నమాట. - ఈ మహోదారకృత్యానికి పరిపూర్తిని తాత్కాలికోద్వేగంతో అంటోనీ ఆక్టేవియాను వివాహమాడటం ఉత్తమఫలోపేతమని భావించాడు. ఉద్వేగం తగ్గిన తరువాత ఇది చెరుపు కలిగించేటట్లు అతనికి తోచింది. ఆక్టేవియాను వివాహమాడటం ఆంటోనీ చేసిన గొప్ప పొరపాటు పని. మహాలాభం చేకూరుతుందన్న భ్రాంతిపడి, ఆంటోనీ ఆక్టేవియాను వివాహమాడి సీజర్ చేతుల్లో పడిపోయాడు. గౌరవాన్ని ప్రకటిస్తూ వచ్చాడు - ఫుల్వియా సీజర్మీద తిరగబడి ఇటలీ నుంచి పారిపోయి వచ్చినప్పుడు, సెక్టస్ పాంపే, ఆంటోనీ తల్లికి అతిగౌరవంతో ఆతిథ్యమిచ్చాడు. అందువల్ల లోకం వారిద్దరూ సంధి చేసుకొన్నారని కూడా భావించింది. మైసనం - కాంపేనియా వద్ద నాలికలా సముద్రంలోకి చొచ్చుకొనిపోయి పై నామంతో వ్యవహరింపబడే భూభాగం. సిడ్నస్ నదిమీద సిడ్నస్ నది మౌంట్ టార్సస్ లో పుట్టి, టార్సస్ నగరంమీదుగా ప్రవహిస్తున్నది. ఆంటోనీ క్లియోపాత్రాను సిడ్నస్ నదిమీద కలుసుకోలేదు. ఆమె సమ్మోహనరూపంతో సిడ్నస్ నదిమీద తన నౌకలో ఉండగా, ఆంటోనీ విపణిలో ఉన్నతాసనాన్ని అధిష్ఠించి ఒంటిగా కూర్చొన్నాడు. ఆమె దిగివచ్చి అతణ్ణి రాత్రివిందుకు ఆహ్వానించింది. అందువల్ల ఇక్కడ 'నది మీద' అంటే నదీతీర ప్రాంతం అని అన్వయించుకోవలసి ఉంది. స్థపతి శిల్పించి నిల్పిన వీనస మూర్తి - ఈ చిత్రం సుప్రసిద్ధ గ్రీకుచిత్రకారుడైన ప్రొటొజెనస్ గీచిన వీనస్ అని కొందరు విమర్శకులు, అపెల్లస్ గీచిన 'సాగరోద్భవ అయిన వీనస్' అని కొందరు విమర్శకులు భావిస్తున్నారు. నెరైడ్స్ : జలకన్యలు (అప్సరసలు) మత్స్యకన్యలు - వీరు మెర్మైడ్లు. వీరికీ నెరైడ్స్కు రూపంలో విభేదముంది. నెరైడ్స్ పరిపూర్ణమానవరూపంలో ఉంటారు. మెర్మెయిడ్లు కటిప్రదేశం వరకూ మానవాకారాన్నీ, క్రింద మత్స్యాకారాన్నీ వహిస్తారు. ఆంటోని - క్లియోపాత్రా 311
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/311
Appearance