30. 31. 32. 33. 34. 35. ద్వితీయాంకం ఎపిక్యురస్ - క్రీ.పూ. 342 - 270 ఒక గ్రీకు తత్త్వవేత్త. 'ఎపిక్యురస్' మతానుయాయులు మహోన్నతానందం మంచివల్ల కలుగుతుందని ఎపిక్యురస్ సిద్ధాంతం. కానీ తరువాతి కాలంవారు ఇతడు 'ఇంద్రియలోలత'నే మహానందంగా నిరూపించినట్లు అపార్థం కల్పించి, ప్రచారం చేశారు. అందువల్ల అతడి అనుయాయులంటే ఇంద్రియలోలురనే అర్థం వచ్చింది. ఈజిప్టువిగతభర్తృక : సోదరుణ్ణి వివాహమాడి అతడి మరణం వల్ల విధవ అయిన క్లియోపాత్రాను గురించి ఏహ్యభావాన్ని ప్రకటిస్తూ, పాంపే ఈ పదప్రయోగం చేశాడు. జూపిటర్: రోమన్ దేవతాగణంలో ప్రముఖుడు. గ్రీకుల జూయెస్ వంటివాడు. సం. ద్యౌః పితరుడు. ఈజిప్టు నుంచి రప్పించటానికి - ఫుల్వియా కుటిలబుద్ధి కలది. చిక్కులను కల్పించే స్వభావం గల ఆమె, ఆంటోనీని ఈజిప్టునుంచి రప్పించటానికి ఇటలీలో సీజర్మీద కావాలని తిరుగుబాటు చేసింది. తల్లి వంక చెల్లెలు: ఆక్టేవియా సీజర్కు ఆంకేరియా అనే మరొక తల్లి వల్ల జన్మించిన సోదరి. అతని తల్లి అక్కియా అని ప్లూటార్కు వల్ల తెలుస్తున్నది. దీనినే షేక్స్పియర్ అనుసరించాడు. ఇది చారిత్రికసత్యం కాదు. సీజర్ తండ్రి అయిన ఆక్టేవియస్ రెండవ భార్య అతియా వల్ల సీజర్, ఆక్టేవియా ఇరువురు జన్మించారు. శీలసౌభాగ్యాదులే... చెప్పగలవు: షేక్స్పియర్ మహాకవి ఉత్తమురాలు, ధర్మజ్ఞ అయిన ఆక్టేవియాను పరిహాసపాత్రురాలుగా చిత్రించాడని కొందరి భావం. అది పొరబాటు. గృహ్యజీవితానికి యోగ్యమైన వ్యక్తి అని అగ్రిప్పా, మెకన్నాస్ ఆమెను పొగిడారే గాని, ఇందులో ఆమెను పరిహసించటం ఎక్కడా కన్పించదు. ఆమెయెడ ఈర్ష్య వహించిన క్లియోపాత్రా మాత్రం ఆక్టేవియాను గురించి 'మరుగుజ్జనీ', 'ముద్దమాటలు మాటాడుతుం'దనీ వర్ణించింది. ఆమెచేత ఇలా అనిపించటంలో షేక్స్పియర్ ఔచిత్యాన్నే పాటించాడు. 310 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/310
Appearance