24. 25. మహాభోగివిగా పెరిగినా - ఉత్తమసైనికుని కావశ్యకాలైన సద్గుణాలు సర్వం ఉన్న ఆంటోనీ, నేడు ఎలా కావాలోలుడైనదీ సీజర్ నిరూపిస్తున్నాడు. మాన్ద్రగోరా : ఈ మొక్క కషాయం తాగితే నిద్రపడుతుందిట. దీనిని త్రాగి క్లియోపాత్రా నిద్రించి, ఆంటోనీ వియోగం వల్ల కలిగే బాధనుంచి బయటపడ తలచుకుంటున్నది. 26. అర్ధఅట్లాస్ : అట్లాస్ టిటన్లలో ఒకడు. మారిటేనియాకు రారాజు. ఇతడు పెర్స్యూస్కు ఆతిథ్యమివ్వకపోతే మెడూసా కళ్ళను చూపించి పర్వతంగా మార్చివేశాడు. ఈ పర్వతం ఉత్తరాఫ్రికాలో తూర్పుపడమరల వ్యాపించి ఉందనీ, దానిమీదనే ఆకాశం నిలిచి ఉందనీ, ప్రాచీన పాశ్చాత్యుల భావన. అట్లాస్ తన బాహువులమీద ప్రపంచాన్ని భరిస్తున్నాడని వారి అభిప్రాయం. క్లియోపాత్రా ఆంటోనీని 'అర్ధ - అట్లాస్' అనటంలో అతడూ, సీజరు ప్రపంచాన్ని చెరిసగం పంచుకొన్నారని. ఇట త్రైకూటవీరుల్లో మూడోవాడైన లెపిడసక్కు వ్యక్తిత్వం లేకపోవటంవల్ల, క్లియోపాత్రా అతణ్ణి పూర్తిగా విస్మరించింది. 26A. ఫొయిబస్ ప్రణయ....: ఫొయిబస్ సూర్యదేవత. సూర్యదేవుని క్లియోపాత్రా తన ప్రియుడుగా భావించటం మహామనోజ్ఞమైన ఊహ. కాలకల్పిత గాఢరేఖా.... క్లియోపాత్రాకు ఆంటోనీతో సంబంధం ఏర్పడేటప్పటికి ఆమె వయస్సు ఇరవై మూడు సంవత్సరాలైనట్లు, అప్పుడు ఆమె పూర్ణయౌవనవికాసాన్ని పొందినట్లు ప్లూటార్క్ చరిత్రకారుని పలుకు. కానీ షేక్స్పియర్ మహాకవి ఆ సమయానికి క్లియోపాత్రా వయస్సు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ సూచిస్తున్నాడు. - 27. ఘనుడైన పాంపే ఇతడు చరిత్ర ప్రసిద్ధి నొందిన ఘనుడైన పాంపే కాదు అతని కుమారుడు క్నెయస్ పాంపే. తన సౌందర్యాతిశయంతో జూలియస్ సీజర్, పాంపేలను జయింపగలిగిన తాను ఆంటోనీని అవలీలగా కైవసం చేసుకోగలనని ఆశిస్తున్నది. 28. పరుసవేది : క్షుద్రలోహాలను స్వర్ణంగా మార్చగలదని ప్రఖ్యాతి పొందిన, 'తాత్త్విక - శిల' (Philosopher - stone) 29. సీజర్ను - జూలియస్ సీజర్ను . ఆంటోని - క్లియోపాత్రా 309
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/309
స్వరూపం