15. 16. 17. 18. మనసార ప్రేమిస్తే - క్లియోపాత్రా ఆంటోనీని మనసార ప్రేమించటం లేదనీ, ప్రేమిస్తుంటే అనుసరింపవలసిన మార్గం ఇది కాదనీ, ఈ మార్గం ఆకర్షించటానికంటే వ్యతిరేకం చేసుకోటానికి పనికివస్తుందనీ ఛార్మియన్ భావం. పరిహృతుడైన పాంపే రోమునించి వచ్చిన కాందిశీకులను దయార్ద్ర హృదయంతో చూడటంవల్ల, సెక్స్టస్ పాంపే అధిక ప్రజానురాగపాత్రు డౌతున్నట్లు ఎప్పియస్ చరిత్రకారుడు. కాచపాత్రిక - ప్రాచీన రోమనులు మిత్రుని శవమృణ్మయపాత్రల్లో వారి మరణవేళ తాము కార్చిన కన్నీటిబుడ్లను ఉంచేవారు. నైల్ : ఈజిప్టును సారవంతం చేసే మహానది. 19. చేపలు పడుతున్నాడు. 20. 21. 22. 23. 3 - ఒకమారు క్లియోపాత్రాతో చేపలు పట్టటానికి వెళ్లి, ఒక్క చేపా పడకపోతే ఆంటోనీ కోపం తెచ్చుకొని, తన ఈతగాళ్లను నీళ్ల లోపలికి వెళ్ళి మునిగిఉండి తన గాలానికి చేపలను తగిలించమని ఆజ్ఞాపించినట్లు - ప్లూటారు. త్రాగుతున్నాడు - క్లియోపాత్రా సౌధం నట, నర్తక, ద్యూతక్రీడారతులతోనూ, గారడీవారితోను, త్రాగుబోతులతోనూ నిండి ఉండేదనీ, ఆమె నిరంతరమూ విలాసోపభోగాలతో తేలి ఆడుతుండేదనీ ప్లూటారు. టోలమీ శయ్య : టోలమీ క్లియోపాత్రా సోదరుడు. ఈజిప్టు రాజవంశంవాళు తమ సోదరులనే వివాహమాడటం ఆచారం. అందువల్ల క్లియోపాత్రాను ఆమె సోదరుడైన టోలమీ కిచ్చి సాంకేతికంగా వివాహం చేశారు. క్లియోపాత్రా శయ్య అందువల్ల ధర్మతః టోలమీ శయ్య ఔతుంది. ఆ అతివకు రాజ్యదానం : ఆంటోనీ రోమనుల అభిప్రాయానికి వ్యతిరేకంగా క్లియోపాత్రాను ఈజిప్టు, సిప్రస్, లిడియా, లోయర్, సిరియాలకు రాష్ట్రాని చేశాడు. అప్పుడు క్లియోపాత్రా చంద్రదేవత అయిన ఇసిస్ దుస్తులు ధరించి, నూతన ఇసిస్ లా ప్రజలను దర్శనమిస్తూ ఉండేదిట - (ప్లూటార్కు). మెనక్రేట్స్, మెనాస్ : ప్రజానురాగాన్ని కోల్పోతున్న ఆక్టేవియస్ సీజర్ కాలంలో, ఈ ఓడదొంగలు ఇటలీ భూభాగంమీదికి ఎన్నో దండయాత్రలు చేసినట్లు చరిత్ర చెపుతున్నది. 308 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/308
స్వరూపం