Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మన్న : (బిగ్గరగా, మైమరచి) యశస్విని కా నాయనా, బాలుడూ! తండ్రి పేరు నిలువబెట్టు. హృదయానికి పట్టరాని సంతోషం కలుగుతున్నదోయ్ తండ్రీ.... బావా! బాలుడి యుద్ధం నా చేత కూడా కత్తి పట్టించే టట్లున్నది.

కొమ్మరాజు : తమకు బాలచంద్రుడి వల్ల కూడా సత్కీర్తి.

బ్రహ్మన్న : బావా! అలరాజు త్యాగాన్ని ఆంధ్రలోకం మరచిపోలేదు. అతని మూలకంగా మీకు లోకోత్తరతమైన కీర్తి ఏనాడో ప్రాప్తించింది.

(కొమ్మరాజు పుత్రదుఃఖంతో శిరస్సు వంచుకుంటాడు)

బ్రహ్మన్న : (ఉద్వేగంతో) ఉన్నట్లుండి బావా, బాలుడెందుకో ఆవైపు వెళ్లుతున్నాడు.

కొమ్మరాజు : (పరికించి) నరసింహరాజు మీదికి తలపడ్డట్లున్నాడు.

బ్రహ్మన్న : నిజమే. ఆ మూల తుములయుద్ధం ప్రారంభమైంది. బాలుడి మిత్రులందరూ ఆ వైపు చేరుతున్నారు.

బాలచంద్రుడి గొంతుక : పిరికి పందల్లా పారిపోవద్దు.

ఒక యోధుడి గొంతు : నీ మొగతనానికేనా?

బాలచంద్రుని గొంతుక : కాచుకోండి. యముడి వంటింటికి చేరుకోవాలి.

(కత్తుల కణకణలూ, హాహాకారాలు వినిపిస్తవి)

కొమ్మరాజు : అదీ దెబ్బ! కుమ్ముడు తగరు త్రిప్పు. ఢాక కొట్టు.

బ్రహ్మన్న : (సోద్వేగంగా) బాలుడేడి బావా?

కొమ్మరాజు : అడుగో. అటువైపు. బల్లెపుయుద్ధం ప్రారంభిస్తూ

బ్రహ్మన్న : (వికసిత ముఖంతో) అవును బావా! శత్రుసైన్యానికి సుడిగాలై ఎండుటాకులలా గిరగిరా...

(జయ్ బాలచంద్రుడికి జై, జై బ్రహ్మన్న మంత్రికీ జై, జయ్ చెన్నకేశవా జై అనే హర్షధ్వానాలు వినిపిస్తవి

బ్రహ్మన్న : బావా! ఏమిటా కోలాహలం?

కొమ్మరాజు: నాకూ ఏమీ అర్థం కావటం లేదు.


నాయకురాలు

85