దగ్గరకు వస్తాను" అని కెందులిప్రాంతానికి వెళ్ళిందని మరొక కింవదంతి. తన కపకార మొనర్చిన చోరులు సాధు వేషముల ధరించి తిరుగుచుండగా రాజభటులు వారిని పట్టుకొనినపుడు జయదేవస్వామి వారికి రాజుసన్నిధిని సన్మానమును కల్పించి పంపుచుండగా వారిని మార్గమధ్యమున పృథ్వి తన గర్భమున జేర్చుకొన, రాజభటులు వచ్చి విన్నవించినారట! అపుడు జయదేవస్వామి యా ప్రాంతమున కేగి గరుడ వాహనుని ప్రార్థింప నాతడు ప్రత్యక్షమై ద్రోహుల్ని మరల పుడమినుండి రప్పించి పంపినట్లు మరియొక కథనము వినిపించు చున్నది.
పద్మావతీదేవి పాతివ్రత్యమును బరీక్షింప నొకమారు సాత్యకిరాజు స్వామి ఇంటలేని సమయమునందు విచ్చేసి 'మీ భర్త దుర్జనులచే హతమైనా' డని ఒక యశీకవార్త వినిపింప నామె యాత్మహత్య చేసుకొనగా జయదేవస్వామి తిరిగివచ్చి కృష్ణ సంకీర్తన మొనర్చగా నామె 'సుప్తిబోధిత' వలె మేల్కొనినట్లు మరియొక జనశ్రుతి వినవచ్చుచున్నది.
ఇట్టివి అభూత కల్పనలని త్రోసివేసినను స్వామి అసామాన్య శక్తి సంపన్నుడని అంగీకరించుట కెట్టి విప్రతిపత్తియును లేదు.
జయదేవుని జన్మస్థానం
జయదేవ మహాకవి జన్మదేశాన్ని గురించి పండిత లోకంలో భిన్నాభిప్రాయా లున్నవి. పండిత పరంపరలో అతడు ఉత్కల దేశస్థుడని ఒక అభిప్రాయం ఉంది. ఆయన వంగ దేశంలో జన్మించాడని కొందరు విద్వాంసులు నిర్ణయించారు. జయదేవ కవి తన జన్మస్థలాన్ని గురించి ఏడవ అష్టపది ముద్రికలో "తిందుబిల్వ సముద్ర సంభవ రోహిణీ రమణేన" అని సూచించినాడు. కలకత్తా సర్వకళాశాలలో ఓడ్ర పండితులు, శ్రీ వినాయక మిత్రో మహాశయులు ఒకమారు శ్రీ శివశంకరులకు ఒక లేఖ వ్రాస్తూ[1] జయదేవ మహాకవి జన్మస్థానాన్ని గురించి ఇలా వ్రాసినట్లు తెలుస్తుంది.
“జయదేవుడు ఉత్కలదేశంలోనే పుట్టినట్లు నిస్సందేహంగా చెప్పటానికి తగినంత ఆధారం లేదన వలసి వస్తుంది. అయితే ప్రతాపరుద్ర మహారాజు పదహారో శతాబ్దిలో రాజ్యం చేశారు. ఆయన జగన్నాథ దేవాలయంలో దేవదాసీలు 'గీత గోవిందం' తప్ప
మరేదీ పాడకూడ దన్నట్లు ఒక శాసనంలో కనపడుతోంది. మహారాష్ట్ర దేశంలో ఒకానొక
- ↑ ప్రతిభలో 'జయదేవుడు' (సం. 2 సంచిక 3) అన్న వ్యాసంలో ప్రకటితము.
పీయూషలహరి
517