Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అబ్బా, ఎంత భక్తుడు.. ఎక్కువసేపుంటే బయట పడతానని కాబోలు వెళ్ళిపోయినాడు. విరజ! నీ మాటలు సత్యమేనా? అవి సర్పములేనా?

విరజ: తల్లీ! నీ కనుమానమైతే మొదట నన్ను తియ్యనిచ్చి చచ్చి పోనీ...

మీరా: ఏమైనా సరే! నా ప్రియుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఇదంతా ఏమిటో నాకు అర్థం కావటము లేదు. ఈ విచిత్ర వరపరీక్షలో నేనెందుకు వెనకపడి పోతాను? పడను ముమ్మాటికీ పడను. అవి సర్పమాలికలైనా సరే కృష్ణుని అలంకరించక తప్పదు. (కొద్ది గొంతుకతో చెయ్యి సెజ్జకము దగ్గరికి పోనిస్తూ)


జయ జయ జయ జయ గిరిధర గోపాలా!
జయ జయ జయ జయ గిరిధర గోపాలా!


(అంటూ నెమ్మదిగా మూత ఎత్తుతుంది. అందులో పూలమాలికలు కిల కిలా నవ్వుతవి. మీరా విరజ మొగం చూస్తుంది. ఆమె భిన్నవదనంతో తల వంచుకుంటుంది. పూలహారాలతో విగ్రహాన్ని అలంకరించి గోసాయీలు మీరా సంతోషాధిక్యంలో కొద్దిసేపు)

జయ జయ గిరిధర గోపాలా జయ జయ గిరిధర గోపాలా

(అని సంకీర్తన చేస్తారు. తరువాత నిశ్శబ్దము)

మీరా: ప్రభూ! పూలదండలతో కులకటమేనా? పూబోడిని మరిచి పోయినావా? ఇప్పటికైనా రావా? నాథా! నోట మాటే రాదుగదా! మూగి వాడవా? కావే! మురళీ మోహనమూర్తివే! నాయీ కష్టాలను ఎప్పటికి ఈడేరుస్తావో కదా! ఈ జగత్తుతో నాకు ఏ సంబంధమూ లేదు. ఇంక అసలే వద్దు తల్లీ, తండ్రి, రాణా అందరూ నాకు కాని వాళ్ళే... నిన్ను ప్రేమిస్తే ఏమో వచ్చి పడుతుందని ఉద్ఘోషించారే మహాత్ములు! ఏమి వచ్చింది నాకు... వచ్చింది.. ఆఁ ఏమిటి? వట్టివేదన... చిన్నతనంనుంచీ నీ రూపాన్నే స్మరిస్తూ పలవరిస్తూ ఉన్న దానిమీద ఇంత నిర్దయా ప్రభూ! నీ నామస్మరణకు శిలలు ద్రవిస్త వన్నారే నీ హృదయమింత పాషాణమే మరి? మెరుపు మెరసినట్లు కనబడి తప్పించుకొని నావే! నాథా! అవి ఎప్పటికైనా ఫలించేవేనా? ఎన్నాళ్ళకైనా ఊహా సౌందర్యామృత పావనమేనా మీ అధరామృతపానం నాకు లభించదా?

రాణా: (చేతిలో పాత్రతో ప్రవేశించి విచిత్ర కంఠంతో) ప్రేయసీ! మీరా! నీ పరిపూర్ణానురాగానికి మెచ్చుకున్నాను. ఇదిగో... అమృతపానం చెయ్యి... (విషపాత్రిక అందిస్తాడు)


508

వావిలాల సోమయాజులు సాహిత్యం-2