మీరా: (నెమ్మదిగా తెప్పరిల్లుకొని లేస్తుంటుంది)
గోసాయీలు: జై మీరా మాయికి జై!
జై మీరామాయికి జై!
మీరా: (విభ్రాంతితో నే) ప్రభూ! ఎన్నాళ్ళని నిద్రాహారాలు లేకుండా వియోగంతో...
ఇస్ (అలోచన అభినయించి) ఏమి తప్పు చేశాను... (దృష్టి రాణా పంపిన సెజ్జమీద
ఉంచి) అవును.. నిజమే... తెలిసింది. తప్పు చేశాను. రాణా ప్రభుభక్తుడైనాడు. రాణా
ఆజ్ఞను ధిక్కరించాను.. మొదట గోసాయీ యిచ్చిన హారంతో నాథుణ్ణి అర్చించాను...
అబ్బా! ఎంత తప్పిదం చేశాను.. ప్రభో, క్షమించు. ఇదుగో నీ మెడలో వేసి కళ్ళార
చూచి ఆనందిస్తాను. (సెజ్జ కాని దగ్గిరకు తీసుకొని తియ్యటానికి చెయ్యి పోనిస్తుంటుంది.
చివరగోసాయి అతని మిత్రుడు లేచి వెళ్ళిపోతారు).
విరజ: (గంట కొడుతూ ప్రవేశించి ఆతురతతో) అమ్మా! అమ్మా! ముట్టుకోకు.. ముట్టుకోకు... తియ్యకు! తియ్యకు! అవి పుష్పమాలికలు కావు! సర్వాగ్ని జ్వాలామాలికలు. రాణా శివారాధకుడు అన్న సంగతి మరచిపోయినావా తల్లీ!
మీరా: (ఆశ్చర్యచకితయై) విరజా! ఏమిటీ తొందర?
విరజ: తొందర ఏమిటి తల్లీ! నిమిషము ఆలస్యమే ఐతే కొంపలు అంటుకో పొయ్యేవి.
మీరా: ఏమిటీ?
విరజ: అమ్మా! ఇందాకటినుంచీ తమ చేతులో హారమేదో ఉన్నదటగా
మీరా: అదిగో! నా స్వామిని దానితో అర్చించాను.. అయితే-
విరజ: దానిని రాణా ఎక్కడినుంచో మీ చేతిలో ఉండటము ... చూచాడు. ......... .అయితే దాంట్లో తప్పేముంది. ఈ గోసాయీ నాకిచ్చారు......... (గోసాయీలు కనిపించరు ఆశ్చర్యపడి) ఆఁ!
విరజ: అది ఢిల్లీ చక్రవర్తి అక్బరు పాదుషాకు కానుకగా ఇచ్చాడట! రాణా మిమ్మల్ని అనుమానించి.. (సర్పాల సెజ్జ చూపుతుంది)
మీరా: మహాగాయకుని తాన్సేనును వెనుక పాదుషా ఒకనాటి సంకీర్తనతో తన మందిరాన్ని పవిత్రం చెయ్య మని కోరి రమ్మని పంపించాడు. నేను అంగీకరించలేదు. పాపము సంకీర్తన వినటానికి గోసాయీ వేషంతో ఎంత దూరం నడిచి వచ్చాడు..
ఏకాంకికలు
507