Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జయ జయ జయ జయ గిరిధర గోపాలా!
జయ జయ జయ జయ గిరిధరగోపాలా!
     అలికుల గానోద్భూతామృతరస
లలితమాలపదాంబుజయుగళా, గోపాలా!

  (తల ఎత్తి కేకిపింఛాన్ని నిరూపిస్తూ)

మకుట ఘటిత కేకిపింఛరుచి శబలిత
సకలాశాపరిపూరిత దివ్యతేజ, గోపాలా!

  (కన్నులదగ్గరకు లేచి కలయజూస్తూ)

       అక్షయ గోపీతరళ కటాక్షా
క్షీణ మనోహరా రాజీవాక్షా, గోపాలా

  (మురళీగానాన్ని అభినయిస్తూ)

    రాధాధర మధుర సుధారస ధా
రారంజిత బింబాధర వంశీరవ గోపాలా

           (చక్రభ్రమణంతో)

   జయ జయ జయ గిరిధర గోపాలా!
జయ జయ జయ జయ గిరిధర గోపాలా!

(తన్మయురాలైన గోసాయీల మధ్యకు చేరి)


అడుగో నా ప్రియుడు నవ్వుతున్నాడు. మన పిలుపు అందింది. ఓహో! ఎంత రసికుడు... పల్లవీ కన్యలమధ్య పిల్లనగ్రోవి మౌని... నా కంఠాన్ని అనుకరిస్తున్నాడు. కనికరం కలిగింది కాబోలు. అదుగో నీల మేఘం అదేమిటి... అబ్బా! ఏమిటా మెరుపు దానికి పైగా... (అనుమానించినట్లు పరికించి మిలా మిలా కళ్ళార్పి) ఔను... ఔను తెలిసినది... అంతే నా మనోనాథుడు గోలోకం నుంచి బయలు దేరి వస్తున్నాడు... ఆ ఆషాఢమేఘచ్ఛాయలు ఆయన దేహకాంతులు... ఇదిగో మనమంతా నీలనీలంగా మారిపోతున్నాము. అయ్యో! కాంచనాభరణాలను త్యజించిన నా ఒంటిమీద బంగారపు రుద్రాక్షల జపమాలలు నిలుపుతూ నిమిషంలో మటుమాయమై నిమిషంలో జ్యోతిష్మతులను వెలిగించే ఆకాంతులేమిటో తెలుసునా? నా హృదయవతి కేకిపింఛసంకాశం. నెమ్మది నెమ్మదిగా... నాకోసకు. ఔను నాకోసకు దిగి వస్తున్నాడు.


ఏకాంకికలు

503