Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎందుకు రాడు, వస్తాడు. ఇద్దరమూ చిన్ననాటినుంచీ స్నేహితులము. మా అమ్మ పక్కలో నేను. నా పక్కలో నా హృదయపతి... అడుగో మరీ మరీ దగ్గిరికి వస్తున్నాడు. (గోసాయీల కేసి చూస్తూ) మీరేమీ చూడటము లేదూ! అలా బిక్కమొగాలు వేసుకొని కూర్చున్నారేమిటి? (ఒక గోసాయి దగ్గిరకు వచ్చి) స్వామీ! నా మనోహరుడు మీకు కనబడటం లేదూ?

గోసాయీ: (లేదన్నట్లు తల తిప్పుతాడు.)

మీరా: (మరొక గోసాయిదగ్గరకు వచ్చి) మహాత్మా! మీకో?

గోసాయీ: ఏడమ్మా తల్లీ, ఎక్కడ! నీది వట్టి భ్రాంతి!

మీరా: అదేమిటి స్వామీ, కళ్ళ ఎదుట అలా కనిపిస్తూ ఉంటేనే!

గోసాయీ: ఇదేమిటమ్మా! ఎన్నడూ కనీ వినని దీచిత్రం... నీది వట్టి భ్రాంతి. ప్రభువేమిటీ? మనదగ్గిరికి రావడమేమిటి? రూపగోస్వాములు ఎన్నడూ చెప్పలేదే. దేహయాత్ర చాలించి మనమే గోధామంలో ప్రభువును కలుసుకుంటాము. గాని ఇదేంమాట! ఎన్నడూ వినలేదు...

మీరా: చాలులే మహాత్మా, చాలులే! అబ్బా! ఎక్కడేమిటయ్యా? స్వామి! (జరిగిపోతూ మరొక గోసాయితో) తేజోమూర్తులు తమకు తప్పకుండా కనిపిస్తూంటా డనుకుంటాను.

గోసాయీ: తల్లీ! దూరంగా ఏదో లీలగా కనిపిస్తున్నది.

మీరా: కాదు కాదు మీ కన్నులు ఆయన వెలుగును భరించలేక పోతున్నవి... అడుగో ఆయన వచ్చేస్తున్నాడు. నేను ఏం చేసేది స్వామీ! ఏమి చెయ్యమన్నారు? ఆయన వచ్చేదారిలో దుమ్ము అంటుకుంటుంది కాబోలు. పూవులు చల్లిరానా? వద్దు వద్దు. పమిట పరిచి వస్తాను. అర్ఘ్యానికి జలం సిద్ధం చేసుకోనా? అవసరం లేదు. హర్షాశ్రు వు లున్నవి కదా! వస్తున్నాడు కదూ నామనోనాథుడు!

గోసాయీ: అవునమ్మా! తల్లీ, ఏదో తేజోవిగ్రహం. మనవైపుకే కదిలివస్తున్నది.... (తన్మయుడై) తల్లీ! (మెడలో చెయ్యి పెట్టి హారం బయటికి తీసి) ఇదిగో ఈ హారం వేసి అర్చించు... (చేతికి అందిస్తాడు).

మీరా: (చేతికి హారం తగిలేటప్పటికి స్మృతికి వచ్చి) ఏమిటిది? నేను ఇందాకటినుంచీ. ఏ లోకంలో ఉన్నాను? ఈ పూజామందిరానికి ఎలా వచ్చాను? ఇదుగో వీరంతా


504

వావిలాల సోమయాజులు సాహిత్యం-2