మధుర ప్రియ
(చిత్తూరు రాజమందిర ప్రాంగణము. గిరిధరగోపాల పూజామందిరము ముందు వితర్దిక
మీద శిలావిగ్రహము. గోసాయిలు ముందు వచ్చి కూర్చుంటారు. సేవకురాలు
పూజాద్రవ్యాలు పట్టుకోవస్తుంటే వెనుక అర్ధనిమీలిత నేత్రాలతో మీరా ప్రవేశిస్తుంది.
ఒకవైపునుంచి. సూర్యాస్తమయానంతరమూ మీరాబాయి రావటాన్ని జూచి)
గోసాయీలు: జై! చిత్తూరు మహారాణీ మీరాబాయికి జై!
జై! చిత్తూరు మహారాణీ మీరాబాయికి జై!!
మీరా: (దగ్గరకు వచ్చి) ఓహో! ఈనాడు కృష్ణాష్టమి. నా ప్రభువు జన్మదినము. అందుకనే
కాబోలు పూజామందిరము కిక్కిరిసిపోతున్నది. గోసాయీలతో... అబ్బా! ప్రభుతుల్యులు,
ఎంతమంది గోసాయీలు... భక్తబృందానికి వందనాలు!
గోసాయీలు: జై! చిత్తూరు మహారాణీ మీరాబాయికి జై!
జై! చిత్తూరు మహారాణీ మీరాబాయికి జై
మీరా: (నాలుగు దిక్కులు కలయజూచి) మహానుభావులారా! ఎవరా చిత్తూరు
మహారాణీ! ఏది? ఎక్కడ?... (నవ్వుతూ) మీరా చిత్తూరుకు మహారాణీ కాదు. ఆ
మహారాణీ పుట్టలేదు... మాయారహితుడు, మహాప్రభువు. గిరిధర గోపాలుడికి ఈ
మీరా ఆత్మను అంకితం చేసిన ప్రేయసి... కాదు... కాదు... పాదదాసి.
గోసాయీలు: జై! మీరామాయికీ జై!
జై! మీరామాయికీ జై!
మీరా: అతిథులారా! నా మనోహరుని పుట్టినరోజని దేశదేశాలనుంచీ సంకీర్తనకోసం
వచ్చిన మిమ్మల్ని చూస్తే నా హృదయం ఉప్పొంగిపోతున్నది! ఎందరు వైష్ణవభక్తులు...
నా కళ్ళు చూడలేక పోతున్నవి. జయ పెట్టవలసింది నాకు కాదు... (విగ్రహం కేసి
చూపిస్తూ, సమీపిస్తూ) అడుగో ఆ మోహనమూర్తికి... నా మనోనివాసికి... కాదు నా
మనోహరుడికి...
(దగ్గరకు చేరి కూర్చొని విగ్రహ పాద పద్మాలను నిమీలితలోచనాలతో దర్శిస్తూ)
502
వావిలాల సోమయాజులు సాహిత్యం-2