Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాణి : నేను బంధులుణ్ణి ప్రసవించినప్పుడు కూడా ప్రజలు ఇంత ఉత్సాహాన్ని ప్రకటించలేదు. అయినా అది మాకు అనవసరం కూడాను. కజ్జల : కారణం. రాణి : ప్రజ ప్రేమించినా ప్రేమించకపోయినా వాడు యువరాజు కాక తప్పకపోవటం. అతని ఆజ్ఞానుసారంగా వాళ్లు నడవక తప్పకపోవటం. కజ్జల : దేవీ! రాజ్యార్హత కేవలం పుట్టుకతోటి వచ్చే శాశ్వత భోగం కాదు. ప్రేమ మూలకంగా రాజ్యాన్ని సంపాదించుకొని ప్రజలను సంతుష్టి పరచిన రాజులదే ప్రజ్ఞ. చరిత్రల్లో వన్నె కెక్కిన రారాజు లందరూ ఇటువంటివారే. రాణి : నీవన్నమాట సత్యమే కజ్జలా! ఈ విషయం నాకిప్పుడు కాదు, ఈ కాశ్మీరంలో కాలు పెట్టినప్పుడే తెలిసింది. సీతాకోక చిలుకల్లా చిందులేసే చేటికలకే ఈ దేశంలో పరమ పతివ్రతలకన్నా ప్రాభవం, విస్తారం. గౌరవం అత్యధికము. మొదట మొదటా నా మనస్సుకు ఎంతో కష్టం వేసేది. కాని తరువాత తరువాత మెట్టిన చోటు ఎంత నికృష్టమైనదైనా ఆ దేశాచారాన్ని మన్నించక తప్పదని మనస్సును సమాధాన పరిచాను. కజ్జల : పాతివ్రత్యం బహూకృతి కోరదుగదా! ఒక వేళ వాంఛించినా అది అందులోనే ఉంది. రాణి : అదొక్కటే సంతృప్తి పతివ్రతలకు. కానీ ప్రాభవం కోసం ఒకప్పుడు కొందరు పతివ్రతలు తమ పాతివ్రత్యాన్ని కూడా బలి ఇవ్వటానికి వెనుకాడరు. కజ్జల : బలి ఇవ్వటమనటంలో మీ అభిప్రాయం? రాణి : (అర్ధోక్తిగా) కజ్జలా! మనకెందుకిప్పుడీ అనవసర ప్రసంగం. ఆ విషయాన్ని ఇకపోనీ - అనవసరంగా తరచకు. మన సంభాషణ విషయాలు ఎన్నడూ శివదేశికుల చెవిన పడ నీయకు - మన వయస్సులో ఉన్నవాళ్ళు మభ్యపెట్టి ఇంకొకళ్ళ మనస్సును ఆకర్షించాలని పూనుకోటం ఎంత పొరబాటు. ఇన్నేళ్ళు వచ్చిన తరువాత మనకు మదనుడు ఏ ఊహలు ప్రసాదిస్తే ఏం ప్రయోజనం. పతివ్రతలంగా ఉండటం తప్ప మరొక పని చెయ్యలేం గదా! ఆ మాటని ఊరుకుంటామా అంటే ఊరుకోనూ లేము. మధ్య మధ్యా మన్మథ బాణాలకు గురికావటం తప్పించుకోలేము. అటువంటి సమయాలల్లోనే మనం జాగరూకత వహించాలి. చిత్త చాంచల్యానికి చోటివ్వకూడదు. చితిమంటలు ఎక్క వలసి వచ్చినా శీలం కాపాడుకోవాలి. ఏకాంకికలు 379