కజ్జల : దేవీ! మీరేమి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. రాణి : పాపం! పిచ్చిదానివి. నీ చుట్టూ ఎన్ని కుట్రలు జరుగుతున్నవో నీకేం తెలియటం లేదు? మహారాజు మాటమాత్రం నీ చెవిలో వేయలేదూ?... (అటూ ఇటూ చూస్తూ) ఎప్పుడైనా సరే జ్ఞప్తికుంచుకో... చుట్టూ మాంత్రికులు. మధ్య మనం. వాళ్ళ తంత్రాలల్లో నుంచీ ఎవరూ తప్పించుకోలేరు. కాల్చినా మళ్ళీ పుట్టుకువచ్చే వీళ్ళను కాలుడే జయించలేకపోతున్నాడు. ఒక్కొక్క మాంత్రికుడి చేతిలో ఎన్నెన్ని పిశాచాలున్నవో నీకు తెలియలేదన్నమాట! ఎంత మంది రాజులు వాటి కాహుతై పోతున్నారో నీవు ఎరగవన్నమాట!! - అదేం కజ్జలా అలా చల్లబడిపోతున్నావు? కజ్జల : లేదు దేవీ. కానివ్వండి మీరు దయ ఉంచి మరికొంత ప్రస్ఫుటం చెయ్యాలి మీ ప్రసంగం. రాణి : ఆ పిశాచాలు మన ఆస్థానమంతటా వికృతనృత్యం చేస్తున్నవి. ధనార్జనకోసం కొందరూ, గౌరవవాంఛతో కొందరూ, ప్రేమ పేరుతో మరికొందరూ వాటికి తమ పవిత్రాత్మలను అమ్మేసుకుంటున్నారు. పాపం! అభీరుడు ఎంత మంచివాడో నీవు ఎరుగుదువా? ఎరక్కపోవటమేమిటి? తన భార్యను ఒక పురుష పిశాచానికి ప్రీతిపూర్వకంగా అర్పించాడు. ఆ పిశాచాలల్లో కల్లా నాయకురాలు తనను ప్రేమించిన మహారాజుకు విషమిచ్చి చంపేసిందట. విషము! అమ్మయ్యో విషము!! ఏది ఏది తాగబోయినా విషం. దాని చెల్లెలు మళ్ళీ పెళ్ళి ముట్టుకోబోయినా విషం - చేసుకోటానికి అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్తకు పాషాణం పోసింది. పురుషుల్లో క్రౌర్యముంటుందంటే వెనక నమ్మేదాన్ని. స్త్రీలల్లో క్రౌర్యం. కుసుమ కోమలులా! గండశిలా కర్కశలు! స్త్రీలు! స్త్రీలు కూడా విషప్రయోగం. కజ్జల : మీరు ఇంతగా ఎందుకు ఆశ్చర్య పడుతున్నారో నాకవగతం కావటం లేదు. రాణి : అంటే స్త్రీలు కూడా విషప్రయోగం చేస్తారన్నమాట. కజ్జల : ఎందుకు చెయ్యరు, కోరికలు సిద్ధించటమే ప్రధానంగా పెట్టుకున్నవాళ్ళు. కోమలాంగులయితే ఆ సాధనను స్వీకరించటానికి మరీ త్వరగా లొంగుతారు. రాణి : నరకం మాటే మరచిపోతారా ఆ సమయంలో, కజ్జల మరవకు రానూవచ్చు పోలిస్తే నరకం ఏపాటిది? 380 రాకపోనూ వచ్చు. అయినా క్రౌర్యానురాగంతో వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/380
Appearance